తమిళనాడును పోలీసులు జల్లెడ పడుతున్నారు. శ్రీలంక తరహా దాడులకు లష్కరే తోయిబా కుట్రపన్నిందన్న ఐబీ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తమిళనాడులోను హైఎలెట్ ప్రకటించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పర్యాటక ప్రదేశాలను నేతలను లక్ష్యంగా చేసుకుని ఆరుగురు ఉగ్రవాదులు శ్రీలంక నుంచి తమిళనాడులోకి ప్రవేశించారని ఐబీ తమిళనాడు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వారిలో ఒకరు పాకిస్తాని కాగా మిగిలిన ఐదుగురు శ్రీలంక ముస్లింలుగా భావిస్తున్నారు.



తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్  ప్రకటించడం జరిగింది.ఎందుకంటే దాదాపు ఆరు మంది ఉగ్రవాదులు, ఒక పాకిస్థాని ఉగ్రవాదులతో పాటు శ్రీలంకకు సంబందించినటువంటి ఐదుగురు ముస్లిం యువతలను కూడా ఈ గ్రూప్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఆరు మంది వయా శ్రీలంక మీదుగా తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లుగా ఐబి గుర్తించడం జరిగింది. ఈ కారణంగానే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగరాలన్నిటినీ కూడా హై అలర్ట్ ప్రకటించారు.



ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా ప్రధానంగా ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ తో పాటు ఆలయాలన్నింటిలోనూ కూడా జల్లెడ పడుతున్నారు.ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు కేంద్రంగానే ఈ సోదాలనేది ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే గత మూడు నాలుగు నెలల్లో ఎన్ ఐఏ పెద్ద ఎత్తున దాడులు చేసింది. సోదాలు చేసింది. ఈ  దాడుల్లో దాదాపు ఇరవై ఐదు మందికి పైగా ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేయడం జరిగింది.



అది రామనాథపురం జిల్లాలో జరిగింది. అటు తర్వాత ఐసిస్ సానుభూతిపరుల సంఖ్య తమిళనాడు రాప్ట్ర వ్యాప్తంగా పెరుగుతుందన్న అనుమానాలు అయితే గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆరు మంది ఉగ్రవాదులు శ్రీలంక మీదుగా వయా తమిళనాడులోకి ప్ర్రవేశించినట్టుగా గుర్తించడం జరిగింది.అందులో భాగంగా హెచ్చరికలను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేయటంతో పూర్తి స్థాయిలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను ఏర్పాటు చేస్తుంది.



ఎక్కడైతే షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉంటాయో వాటిని కూడా టార్గెట్ చేసుకునే అవకాశముంది. అది ఎక్కువగా చెన్నైలో ఉన్నటువంటి టీ నగర్ తో పాటు కోయంబత్తూర్ లో సెంట్రల్ లో ఉన్నటువంటి వాటన్నిటీ ఈ తరహా దాడులు ఏదైతే శ్రీలంకలో చేపట్టినటువంటి తరహా దాడులు ఇక్కడ చేయాలని వారి ప్లాన్ కాబట్టి, అటువంటి ఘటనలు ఇప్పుడు జరక్కుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: