నిరుద్యోగులకు ఎవరైన కాల్ చేసి మీకు ఉద్యోగం కావాలఅని అడ్డగ్గానే ఎక్కడ లేని సంతోషం వస్తుంది.అదే సాఫ్ట్‌వేర్ కంపెనీ నుండి చేస్తున్నాం మీకు మంచి ఆఫర్ ఇస్తున్నాం అని చెప్పారనుకో ఎగిరి గంతేసి చంకలో సర్టిఫికెట్స్ అన్నిపెట్టుకుని వారు చెప్పిన అడ్రస్‌కు బయలు దేరుతారు.కొందరైతే ముందు వెనకా ఆలోచించకుండా అన్ని డిటైల్స్ అందిస్తారు.అది ఎలాంటి కంపెనీ అని కూడ తెలుసుకోలేరు.ఇలా ఎంతమందో ఇప్పటివరకు మోసపోయి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.ఇలాంటి సంఘటనే మరోటి వెలుగులోకి వచ్చింది.మియాపూర్ పోలీసుల కధనం ప్రకారం.కార్పొరేట్ ఉద్యోగం పేరిట వందలాది మంది యువతులను మోసం చేసిన ఘరానా మోసగాడి బాగోతం బట్టబయలైంది.బాధితుల ఫిర్యాదుతో వందలాది మంది మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కీచకుడి ఆటకట్టించారు పోలీసులు.వివరాల్లోకెళితే,



తమిళనాడుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రదీప్ అనే కేటుగాడు,అర్చనా జగదీష్‌గా మహిళ పేరిట పేస్‌బుక్ ఖాతాను ఓపెన్ చేశాడు.ఆన్‌లైన్‌ వేదికగా ఉద్యోగ వేటలో ఉన్న మహిళలు,యువతులే లక్ష్యంగా చేసుకుని వారి ఫోన్ నెంబర్లను,ఇతర వివరాలను సేకరించాడు.అలా సేకరించిన నెంబర్లకు ఇంటర్వ్యూ పేరుతో సందేశాలు పంపేవాడు.అలా వారితో కనెక్ట్ అయి.వారిని మెల్లగా తన ట్రాప్‌లోకి దించి,త్రీస్టార్,ఫైవ్ స్టార్ హోటళ్లలో,సాఫ్ట్‌వేర్ కార్యాలయాల్లో ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ వారిని నమ్మించేవాడు.అయితే ఈ ఉద్యోగానికి ఫిజిక్ తో పాటు అందంగా ఉండాలని, న్యూడ్ ఫోటో పంపిస్తే పరిశీలించి ఉద్యోగానికి సెలక్ట్ చేస్తానంటూ,వారికి మంచి జీతం కూడా ఉంటుందంటూ నమ్మించేవాడు.



అలా అతడిని నమ్మి దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన దాదాపు 600 మంది మహిళలు,యువతులు తమ న్యూడ్ పిక్స్ పంపినట్లు విచారణలో వెల్లడైంది.అయితే ఉద్యోగం ఇప్పించకపోగా ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని కీచకుడు ప్రదీప్ మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.ఇతగాడి వేధింపులు తాళలేక కొందరు బాధిత మహిళలు మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు.నిందితుడిని అదుపులోకి తీసుకుని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కాగా ఈ విషయం తెలుసుకున్న భాదిత కుటుంబాల తల్లిదండ్రులు అతన్ని కఠినంగా శిక్షించాలంటూ పోలీసులను కోరుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: