ఏపీలో వైఎస్ జగన్ 70 రోజుల పాలనపై భిన్న వాదనలు ఉన్నాయి. బాగుందని కొందరు అంటే దశా దిశా లేదని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ పాలనపీ ఏకగ్రీవ అభిప్రాయం మాత్రం లేదు. అయితే పాలన ఇంకా మొదలు కాలేదని వైసీపీ నేతలు ఓ వైపు చెబుతూంటే తొలి రెండు రీళ్ళు  సిన్మా చూసి ఫ్లాప్ అనేస్తున్న వారు మరికొందరు.


ఈ జాబితాలో టీడీపీ పక్కన బీజేపీ కూడా నిలిచింది. బీజేపీకి జగన్ పరిపాలన అసలు నచ్చడంలేదుట. జగన్ పాలనలో జనం నానా అవస్థలు పడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. పాలించడంలో తడబాట్లు ఉన్నాయని, పొరపాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ పాలన చూసిన తరువాత కట్టు బట్టలతో జనం పొట్ట చేత పెట్టుకుని వలసలకు పోతున్నారని కూడా బీజేపీ నేత రాం మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు.


జగన్ పరిపాలన ఇదే తీరుగా కొనసాగితే మాత్రం బీజేపీ డైరెక్ట్ గా రంగంలోకి దిగుతుందని ఆయన హెచ్చరించారు. మేము కనుక బరిలోకి దిగితే ఆ కధే వేరుగా ఉంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీలో వైసీపీకి తామే అసలైన ఆల్టర్నేషన్ అని కూడా ఆయన అన్నారు. బీజేపీని తక్కువ అంచనా వేస్తే రానున్న రోజులో తమ పార్టీ అంటే ఏంటో చెబుతాయని కూడా ఆయన అన్నారు.


ఇదిలా ఉండగా టీడీపీ కంటే దూకుడుగా బీజేపీ జగన్ని విమర్శిస్తోంది. అసలు టైం కూడా ఇవ్వమని గట్టిగా చెప్పేస్తోంది. మేము రంగంలోకి దిగుతాము అంటూ రాం మాధవ్ చేసిన హెచ్చరికలో ఎన్నో అర్ధాలు ఉన్నాయని కూడా రాజకీయ పండితులు అంటున్నారు. ఇప్పటికే జగన్ని అన్ని విధాలుగా ఇబ్బందిపాలు చేస్తున్న బేజేపీ నాయకులు దైరెక్ట్ అటాక్ అంటే మరెన్ని షాక్ ట్రీట్మెంట్లు ఇస్తారోనని కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి జగన్ ది ఫ్లాప్ షో అనేసిన బీజేపీ మరి తరువాత కదపబోయే పావులు ఏంటి అన్నది పొలిటికల్ సర్కిళ్ళలో ఆసక్తిగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: