అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కోడేల కుటుంబం దొంగిలించడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. అడ్డంగా దొరికి పోయిన తరువాత ఇప్పుడు ఫర్నిచర్ ను ఇచ్చేస్తానని కోడెల చెప్పడం ... దీన్ని కోడెలను ఏమనాలో కూడా ప్రజలకు అర్ధం కావటం లేదు. ఇటువంటి ప్రజా ప్రతి నిధి ప్రప్రంచంలో ఎక్కడా కనిపించడని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే కోడెల మీద అంబటి రాయడు విరుచుకుపడ్డారు. కోడెల కుటుంబం పెద్ద గజ దొంగలు కుటుంబమని పోలీసుల కేసుల్లో ఉండి పారిపోయారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారని అంబటి చెప్పుకొచ్చారు. కోడెల దొరికిన దొంగని .. చంద్రబాబు దొరకని దొంగని అంబటి ఆరోపించారు. 


అయితే కోడెల మీద అభియోగాలు చాలా ఉన్నాయి. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు కోడెల గురించి ఫర్నిచర్ దొంగతనం బయటికి వచ్చిన సంగతీ తెలిసిందే. ఒక ప్రజా ప్రతి నిధి అయి ఉండి అసెంబ్లీ కోసం తెచ్చిన ఫర్నిచర్ ను కూడా దొంగిలించే స్థాయికి కోడెల దిగజారిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. టీడీపీలో ఇంకెన్ని ఘోరాలు జరిగివుంటాయో .. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ ఊరికినే అనలేదు .. అవినీతిలో ఏపీ నెం .1. అని . ఏకంగా ఫర్నిచర్ ను దొంగిలిస్తుంటే ఇంకేమి అనాలి. 


అయితే ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలియకుండా జరిగి ఉండదు. చంద్రబాబుకు తెలిసినా పట్టించుకోలేదంటే .. బాబు గారికి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అందుకే టీడీపీ కనీ వినీ ఎరుగని రీతిలో ఓటమి పాలైంది. బాబు గారికి ఇన్ని కనిపిస్తున్న మళ్ళీ ప్రజల దగ్దరికి వచ్చి నేనేం తప్పు చేసానో చెప్పండి అంటుంటే వీళ్ళను ఏమనాలో అర్ధం కావటం లేదు. అయితే కోడెల దొంగతనం చేసిన ఫర్నిచర్ విలువ సుమారు 65 లక్షలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: