టీఆర్ఎస్ పై ఓ రేంజ్‌లో విరుచుకుపడే రేవంత్ రెడ్డి... ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసిన  ఆ తరువాత జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి స్తానం నుండి ఎంపీగా గెలిచి తన సత్తా చాటాడు  రేవంత్ రెడ్డి… కాగా ఎంపీగా ఎన్నికను రేవంత్ర్ రెడ్డి అప్పట్లో బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా జరిగింది. కానీ తాను బీజేపీలోకి వెళ్లానని, చివరివరకు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని స్పష్టం చేశారు. కాగా రేవంత్ రెడ్డి సరికొత్తగా ఒక ప్రణాలికలు సిద్ధం చేసుకున్నారట. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్..  తన నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించటానికి  రేవంత్ రెడ్డి ఇప్పటికే అక్కడి తన అనుచరులను రంగంలోకి దించాడట. ప్రజల్లో తన పై ఉన్న నమ్మకాన్ని పెంచే విధంగా రేవంత్ రెడ్డి అనుచరులు పనులు చేస్తున్నారట. మొత్తానికి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ  ఎక్కువ డివిజన్లలో గెలిచే అవకాశాలు ఉన్నాయని  తెరాస వాళ్ళు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డిను ఎలాగైనా అడ్డుకోవాలని మల్కాజ్ గిరికి ఎంపీ నిధులను అందకుండా చెయ్యాలని తెరాస నాయకులు చూస్తున్నారట. ఇందుకోసం అప్పుడే తెరాస వాళ్ళు చర్యలకు  సిద్ధమయ్యారు. అందులో భాగంగా  రేవంత్ రెడ్డి అనుచరగణం పై తెరాస నాయకులు టార్గెట్ చేస్తున్నారట. అలానే  రేవంత్ రెడ్డిను ఎమ్మెల్యేగా ఓడించారు. మరి ఇప్పుడు కూడా ఆలాగే ప్లాన్ చేస్తున్నారు.    


కానీ రేవంత్  ప్రతి  డివిజన్‌లో మంచి పట్టు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ను గెలిపించాలానే కసితో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తేనే..  ఆ తరువాత జరగబోయే జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాలతో  ముందుకు వెళ్తున్నాడు. అలాగే  కేసీఆర్, రేవంత్ ను ఎలాగైనా ఆపాలని  మల్కాజ్ గిరి నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. మరి    మల్కాజ్ గిరి   నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను రేవంత్ రెడ్డి  గెలిపిస్తాడా..? లేక కేసీఆర్ ప్లాన్ మళ్లీ తను ఎమ్మెల్యేగా ఓడిపోయినట్లే.. ఈ సారి కూడా ఓడిపోతాడా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: