భారీ విజయంతో మోదీ - షా ద్వయం  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక.. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అధికారికంలోకి రావాలని ఈ ద్వయం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  బలపడాలనే ఆలోచనతోనే బీజేపీ ఇప్పటికే రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది.  ముఖ్యంగా జగన్ అండ్ కేసీఆర్  విషయంలో బీజేపీ  కాస్త వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. కేంద్రం నుండి సరైన సాయం అందించకుండా... కేసీఆర్  అడిగిన నిధులను ఇవ్వకుండా.. కేసీఆర్ కి  కనీస సపోర్ట్ కూడా చెయ్యకుండా ప్రతి విషయంలో అడ్డు తగులుతుంది.  మొత్తానికి తెలంగాణలో బీజేపీ బలం బలగం పెంచటానికి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తోన్న బీజేపీ అగ్ర నాయకత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పని చెయ్యటానికి రంగం సిద్ధం చేసుకుంది.  ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచే..  బీజేపీ అగ్రనాయకత్వం  ఏపీలో తమ పార్టీ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని..  అందుకే, అసెంబ్లీ ఎన్నికల్లో  కేవలం ఒకే ఒక్క సీటు కూడా గెలవకపోయినా  ఏపీలో వేగంగా బలం పెంచుకోవటానికి బాగానే ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైతే  తెలంగాణలోని  జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో  ఏకంగా 4 ఎంపీ స్థానాలను గెలుచుకుని బలం పెంచుకున్నారో..  ఏపీలో కూడా అలాగే  వేగంగా బలం పెంచుకుంటారట. 


ఇక వరుసగా రెండోసారి విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ను  అలాగే తెలంగాణలో పూర్తిగా పట్టు కోల్పోయిన టీడీపీని పూర్తిగా దెబ్బ తీసేందుకు ఇప్పటికే మోడీ గట్టిగానే ప్లాన్ చేశాడు.  ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, సురేష్ రెడ్డి, బోడ జనార్దన్ లాంటి వాళ్ళను  బీజేపీలో చేర్చుకున్నారు. అలాగే  కొంతమంది కాంగ్రెస్ నాయకుల కోసం పావులు కదుపుతుంది. అలాగే  రానున్న రోజుల్లో  తెరాస నుంచి కూడా భారీగా వలసలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ బడా నాయకులతోనే బీజేపీ అగ్ర నాయకత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే  ఇప్పట్లో  తెరాస నుంచి వలసలు లేకుండా.. ఎన్నికల సంవత్సరం ఉంది అనగా ఒక్కసారిగా తెరాస ను  కేసీఆర్ ను దెబ్బ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. మరి బీజేపీని కేసీఆర్ అండ్ జగన్ ఎలా ఎదురుకుంటారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: