ఇటీవల బీజేపీ లో చేరిన దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరీ ఎంత హడావిడి చేస్తున్నారో అందరికీ తెలుసు. మొన్నటివరకు టీడీపీలో కీలక పాత్ర పోషించిన సుజనా బీజేపీలో కూడా తన హవా కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ హైలైట్ అవ్వాలని అనుకుంటున్నారు. అందుకే తాజాగా అమరావతి మారుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరి సుజనా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టీడీపీ వాళ్ళ కంటే ఎక్కువ ఫీల్ అవుతూ రాజధాని మారిస్తే బాగోదని జగన్ కు డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చారు.


అలాగే తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి హోమ్ మంత్రి అమిత్ షా ల ఆశీర్వాదంతోనే తీసుకుంటున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఇక ఈ విషయంలో కూడా సుజనా జగన్ ని టార్గెట్ చేస్తూ విజయసాయిపై విమర్శలు చేశారు. మోడీ, అమిత్ షా ఆశీస్సులు తీసుకున్నాకే జగన్ ఏ నిర్ణయం అయినా తీసుకుంటారంటే అర్థమేంటి? అని ప్రశ్నించిన సుజనా చౌదరి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.


అయితే మొన్నటివరకు జగన్ పై విమర్శలు చేసిన సుజనా చౌదరీ వాయిస్ ఇప్పుడు మారింది. జగన్ కి సడన్ గా పాజిటివ్ గా మాట్లాడారు. రాజధాని అమరావతి మార్పు విషయంలో జగన్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. రాజధాని తరలిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై రైతులు సీఎంను కలిస్తే మేలని, ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకుని రాజధానిని మార్చడం సమంజసం కాదని అన్నారు.


అయితే సడన్ గా జగన్ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడటానికి గట్టి కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. జగన్ రాజధాని విషయంలో ఇంకా స్పందించలేదు కాబట్టి దానిపై విమర్శలు చేసి ప్రజల్లో చులకన కావొద్దని సుజనాకి సెంట్రల్ నుంచి వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకని అనవసరంగా జగన్ పై విమర్శలు చేయొద్దని  కేంద్ర పెద్దలు ఆర్డర్లు ఇచ్చారని, అందుకే సుజనా ఉన్నపళంగా వాయిస్ తగ్గించి మాట్లాడారని సమాచారం. మొత్తానికి జగన్ విలువ కేంద్రానికి తెలిసినట్లు సుజనాకి తెలియనట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: