మనిషికి ప్రమాదం ఏ వైపు నుండి పోంచి వుంటుందో చెప్పలేం,అంతేకాదు ఇంటినుండి వెళ్ళోస్తా అని వెళ్లిన మనిషి ఇంటికి రావడం కష్టంగా మారింది ఈ కాలంలో,పనిచేసే చోట,కాని రోడ్డుపై నుండి వెళ్లుతుంటే కాని ఏ ప్రమాదమైన చెప్పక రావచ్చు.ప్రమాదం పెత్తనం చెలాయిస్తే మరణం చుట్టం లా వస్తుంది.అది వచ్చినప్పుడు అదృష్టముంటే బ్రతుకుతాం లేదా పోతాం కాని జాగ్రత్తగా ఉండటం మాత్రం మరవ వద్దు.ఇంటి నుండి అందరికి బై బై చెప్పి వెళ్లిన కార్మికులు కొందరు గాయపడగా మరికొందరి పరిస్దితి సీరియస్‌గా మారిందట,అదెలా,ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.



వివరాల్లోకి వెళ్లితే అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉనా పెన్నా సిమెంట్‌ కర్మాగారంలో అగ్నిప్రమాదం సంభవించిందట.అదెలాగంటే కర్మాగారంలో బొగ్గును వేడి చేసే బాయిలర్‌ వద్ద ఉష్ణోగ్రత అధికమై ఈ ప్రమాదం సంభవించిందని.ఈ ఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని.అప్రమత్తమైన కర్మాగారం యాజమాన్యం వెంటనే క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారని తెలిపారు కంపెనీ అధికారులు.



విషయం తెలుసుకున్న కార్మికుల సంబధికులు,బంధువులు,లోకల్ లీడర్స్,కర్మాగారం వద్దకు చేరుకుని..భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆందోళనకు దిగారట.ఈ ఘటన చూసిన యజమాన్యం పోలీసులకు ఫోన్ చేయగా తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు కర్మాగారం వద్దకు చేరుకుని వారితో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేశారు.ఇక గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగాఉన్నట్లు నలుపై ఎనిమిది గంటలు గడుస్తే గాని ఏ విషయం చెప్పలేమని వైద్యులు తెలిపారట.చదివారుకదా ఓ మనిషి మరణిస్తే ఆ కుటుంబమే రోడ్డున పడుద్ది, అలాంటిది ముగ్గురి పరిస్దితి ఆందోళనగా వుందని డాక్టర్స్ చెప్పడంతో వారి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు...పనిచేసేచోట తగు రక్షణ చర్యలు పాటిస్తే కొంతవరకైన ఇలాంటి ప్రమాదాలు నివారించవచ్చు అనుకుంటున్నారు ఈ వార్త చదివిన పాఠకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: