దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిధుల  గోల్ మాల్  వ్యవహారం పై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. టీటీడీ నిధుల విషయంలో గోల్ మాల్ జరిగిందన్న ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్  మెంట్  ద్వారా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించారు . దాదాపుగా రూ. 4 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది .   నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల పేరుతో చందాలు స్వీకరించడమే కాకుండా , రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కాంట్రాక్టర్ల  వద్ద నుంచి అధికారులకు ముడుపులు అందినట్లుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి .


ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఒక సాధారణ భక్తుడు ఆధారాలతో సహా టీటీడీకి ఫిర్యాదు చేశారు . అయితే, దీని పైన గత టీడీపీ ప్రభుత్వ హయాం లోనే   విచారణ ప్రారంభించగా,  ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ జోక్యంతో విచారణ నిలిచిపోయింది. అయితే అప్పట్లో విచారణ నిలిచిపోయిన్నప్పటికీ , నిధుల గోల్ మాల్ వ్యవహారం లో  ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో పని చేస్తున్న ఒక   టీటీడీ అధికారి పైన ఈవో సింఘాల్ వేటు వేశారు . అయితే అప్పట్లో ప్రారంభించిన విచారణ అర్ధాంతరంగా నిలిచిపోవడం తో సదరు భక్తుడు ,  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయి రెడ్డి ని కలిసి , టీటీడీ నిధుల గోల్ మాల్ వ్యవహారాన్ని అయన దృష్టికి తీసుకువెళ్లారు .


విజయసాయి ఫిర్యాదు   మేరకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తో ,  తిరిగి ఇప్పుడు విచారణ చేపట్టారు .  విచారణపై  ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది . ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కేంద్రంగా ఆరోపణలు వెల్లువెత్తుతుండడం హాట్ టాఫిక్ గా మారింది .


మరింత సమాచారం తెలుసుకోండి: