తాను తవ్వుకున్న గోతిలో తానే పడటం అంటే ఏంటో చిదంబరంను చూస్తే అర్ధం అయిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ప్రత్యర్థుల మీద రాజకీయ కక్ష సాధింపులు సాధించి జైల్లో పెట్టించారు. ఇప్పుడు చివరికి ఆయనే జైలు గోడల మధ్య గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికే ఉన్న కేసులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన చిదంబరం ఇప్పుడు మరొకటి చుట్టుకుంది. జనవరి 2019 లో తన కేసులో తానే ప్రధాన నిందితుడు అయినప్పటికీ ఒక సీనియర్ అడ్వ కేట్ గా కోర్టులో హాజరయ్యాడు. ఇది లా ప్రకారం చట్ట వ్యతిరేకమని సుప్రీమ్ కోర్ట్ లో బార్ కౌన్సిల్ ఫైల్ చేసింది. దీనితో చిదంబరం ఇప్పుడు బార్ కౌన్సిల్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి.


అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు చిదంబరం చేసిన పాపాలే ఇప్పుడు తన మెడకు చుట్టుకున్నాయి. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ .. కాంగ్రెస్ కు చుక్కలు చూపేందుకు సిద్ధం అయ్యింది. బీజేపీ మొదటి పర్యాయం గెలిచినప్పుడు ఇటువంటి రాజకీయ కక్ష సాధింపులకు దూరంగా ఉన్నది. కానీ రెండవ సారి భారీ మెజారిటీ రావటంతో కాంగ్రెస్ పార్టీని ఇంకా ఘోర స్థితిలోకి తీసుకురావటనికి అన్ని దారుల్లో ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటీకే కాంగ్రెస్ సీనియర్ నేత .. మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతీ తెలిసిందే. అయితే చిదంబరం పట్ల ఎవరు పెద్దగా సానుభూతి చూపించడం లేదు. ఎందుకంటే ఈయన గారు అధికారం ఉన్నప్పుడు ఇలాంటి పనులే చేశారు. 


అయితే చిదంబరం 2017 నుంచి తప్పించుకుంటూ ఎన్నో స్టే లు తెప్పించుకున్నారు. చిదంబరం అతని కొడుకు కార్తీ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిదంబరం కేంద్ర మంత్రిగా పని చేసిన సంగతీ తెలిసిందే. అప్పుడే చిదంబరం .. కొడుకు కు లభ్ది చేకూర్చాలని పక్క దారిలో విదేశాల నుంచి డబ్బులు ఐఎన్ ఎక్స్ మీడియాలోకి వక్రమార్గంలో నిధులు తరలించారు. స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్ అయిన చిదంబరం అన్నీ జాగ్రత్తలు తీసుకోని స్కాం చేశారు. కానీ ఎంత జాగ్రత్తగా తప్పు చేసిన ఎక్కడో ఒక చోట దొరికిపోతారు. ఇప్పుడు అలానే చిదంబరం దొరికిపోయారు. ఎట్టకేలకు చిదంబరంను సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: