చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతీ తెలిసిందే. ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో చిదంబరం ఉంటున్నారు. అయితే నాలుగు రోజులు సీబీఐ రిమాండ్ అయిపోయిన వెంటనే కోర్టులో చిదంబరంకు బెయిల్ రాకపోతే తీహార్ జైలుకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించబోతున్నారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. 


అలాగే జైల్లో చిదంబరంకు మంచం అది కూడా పరుపు లేకుండా ఉండేది మాత్రమే ఇస్తామని చెప్పుకొచ్చారు. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇటువంటివి ఉంటాయి. మిగతా వారు అయితే కిందే పడుకోవాల్సిందేనని చెప్పారు. అయితే పరిస్థితి చూస్తుంటే చిదంబరంకు బెయిల్ వచ్చేది కష్టంగా మారింది. కేంద్రం కూడా చిదంబరం కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.


అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కేంద్రం చిదంబరం ను అంత తేలికగా వదిలిపెట్టే రకంగా కనిపించడం లేదు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రాకేష్ అహుజాపై బదిలీ వేటు వేసింది. ఇతను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పని చేశారు. దీనితో రాకేష్ ఎక్కడ చిదంబరంకు మేలు చేస్తాడని ఢిల్లీకి బదిలీ చేశారు. అయితే ఎన్నో  నాటకీయ పరిణామాల మధ్య చిదంబరం అరెస్ట్ జరగడం గమనార్హం.  

మరింత సమాచారం తెలుసుకోండి: