మాజీ మంత్రి, విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.... తాజాగా మెగాస్టార్‌ను క‌లిశారు. నిజానికి మెగా స్టార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌ను అభినందించేందుకు క‌లిశారో.. లేక రాజ‌కీయ కార‌ణ‌మో వాస్త‌వాని కి తెలియ‌దు కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం .. గంటా రాయ‌బారంపై పె ద్ద ఎత్తున క‌థ‌నాలు వినిపిస్తున్నా యి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ పెద్ద ఎత్తున ఎద‌గాల‌ని నిర్న‌యించుకున్న క్ర‌మంలో.. రాజ‌కీయంగా అని శ్చితిలో ఉన్న‌ కాపు సామాజిక వ‌ర్గాన్ని త‌న వైప్పుతిప్పుకొనేందుకు బీజేపీ పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే గంటాను త‌న‌వైపు తిప్పుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. 


ఈ నేప‌థ్యంలోనే మెగాస్టార్ చిరంజీవిని పార్టీలోకి చేర్చుకుని, ఏపీలో కాపుల‌ను త‌న పార్టీలోకి చేర్చుకు నేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా .. మెగాస్టార్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు, మాజీ మం త్రి గంటా శ్రీనివాస‌రావు నేరుగా ఆయ‌నతో భేటీ అయ్యార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వార్త పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది. చిరు బీజేపీలో చేరి బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. కాపు వ‌ర్గాన్ని, యువ త‌ను బీజేపీ వైపు లాగా ల‌ని ఆ పార్టీ నాయ‌కులు పెద్ద వ్యూహ‌మే సిద్ధం చేసుకున్నారు. 


దీనిపై చిరు ఎలా రియాక్ట్ అవుతార‌నే విష‌యం ఎలా ఉన్నా.. ఇప్పుడు గంటా వెళ్లి చిరుతో భేటీ కావడం మాత్రం చ‌ర్చ‌నీయాంశ మైంది. ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరు తెచ్చుకున్న గంటా శ్రీనివాస‌రావు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌మి అనేది తెలియ‌ని నా యకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో ఈయ‌న‌ను కూడా బీజేపీ ఇప్ప‌టికే త‌న‌వైపు తిప్పుకొంద‌ని అంటున్నారు. అయితే, గంటా అధికారికంగా టీడీపీని వీడ‌క‌పోయినా.. అన‌ధికారికంగా మాత్రం బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 


అదే స‌మ‌యంలో టీడీపీ నిర్వ‌హిస్తున్న ఏ కార్య‌క్ర‌మానికీ ఆయ‌న ఇప్ప‌టి వ‌రకు హాజ‌రుకాలేదు. దీంతో పార్టీలో ఉంటారో ఉండ‌రో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇంత‌లోనే చిరుతో భేటీ కావ‌డం, చిరును ఓ జాతీయ పార్టీ త‌న చెంత‌కు చేరాల‌ని ఒత్తిడి చేస్తున్న త‌రుణంలో జ‌రుగుతున్న ఈ ప‌రిణామాలు.. ఆస‌క్తిగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: