పిల్లలు పుట్టక పోతే పుట్టలేదని బాధపడతాం.వారికోసం చేయని పూజ వుండదు.గడప తొక్కని హస్పిటల్స్ వుండవు,ఎలాగోలా వారుపుట్టాక తల్లిదండ్రులకు వారే లోకం,వారికోసం వారిభవిష్యత్తు కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంటారు.ఇంట్లో భార్య పిల్లలు హయిగా నిద్రిస్తున్నారంటే ఆ క్రేడిట్ అంతా తండ్రిదే ఎందుకంటే అతను వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నాడనే ధైర్యం.అలాంటి తండ్రికే సెక్యూరిటి లేకుండ పోతుంది.అల్లారుముద్దుగ పెంచిన తన కూతురే తన ప్రాణాలు తీస్తుందని అసలూహించలేక పోయాడు.ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల పల్లెలో కాదు నగరం నడిబొడ్డున.



మల్కాజిగిరిలో వారం రోజుల క్రితం 75 ఏళ్ల తండ్రిని ఓ కొడుకు హత్య చేసి,కిరాతకంగా శవాన్ని ముక్కలుగా కోసి బకెట్లలో నింపిన విషయం తెలిసిందే.తండ్రిని హత్య చేయడానికి తన తల్లి,చెల్లి సహకారం కూడా తీసుకోవడంతో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.ఇదిలా ఉండగా తండ్రిని హత్య చేయడానికి అసలు స్కెచ్‌ వేసిందే కూతురని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.ఆ ముగ్గురిని విచారిస్తున్న క్రమంలో మైండ్‌ బ్లాక్‌ అయ్యే విషయాలు వెలుగుచూశాయి.ఈ సమాజంలో ఇలాంటి కూతుళ్లు కూడా ఉంటారా? ప్రపంచంలో తన తండ్రి తర్వాతే అన్నీ అని చెప్పే ఆడపిల్లలు ఉన్న సమాజంలో తండ్రీ కూతుళ్ల అనుబంధానికి మాయని మచ్చతెచ్చింది ఈ కూతురు,అని పోలీసులు ఆశ్చర్యపోయారు.వివరాల్లోకి వెళ్లితే..




మహారాష్ట్ర పర్బని జిల్లాకు చెందిన సుతార్‌ కిషన్‌ మారుతి(75) రైల్వే ఉద్యోగి.గూడ్స్‌ రైలుకు లోకో డ్రైవర్‌గా పనిచేసి 15ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందాడు.అతడికి నలుగురు సంతానం.ఇద్దరు కొడుకులు,ఇద్దరు కూతుళ్లు.పెద్ద కొడుకు 10 ఏళ్ల వయసులోనే ఇంట్లోంచి వెళ్లిపోగా.ఇక కుమారుడు కిషన్‌,కూతుళ్లు అనుపమ,ప్రపూల్‌ మాత్రమే ఉన్నారు.కూతుళ్లంటే ఆ తండ్రికి పంచప్రాణాలు. పదవీ విరమణ చేయగా వచ్చిన డబ్బుతో మల్కాజిగిరి ఆర్టీసీ కాలనీలో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాడు. పెద్దకూతురు పెళ్లి చేశాడు.చిన్న కొడుకు పదోతరగతి ఫెయిలయ్యాడు.అప్పటి నుంచి ఏ పనీ చేయకుండా జులాయిలా తిరిగేవాడు.అతడి ప్రవర్తన నచ్చక పెళ్లయిన 15 రోజులకే భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది.తన చిన్న కూతురైనా బాగా చదువుకొని తనను ఉద్దరిస్తుందని కలలుగన్నాడు ఆ తండ్రి.బయోకెమిస్ట్రీ చదివిన ప్రపుల్‌ ఏ ట్యాబ్‌లెట్‌ ఎలా పనిచేస్తుంది,దానిలో ఏ ఏ గుణాలుంటాయి.ఏది దేనికి ఎలా ఉపయోగిస్తారు అనే రీసెర్చ్‌ చేస్తుంటుంది,అలా బయో కెమిస్ట్రీలో నేర్చుకున్న తన జ్ఞానాన్ని తండ్రిని హత్య చేయడానికి ఉపయోగించింది.




ఎలాగైనా తండ్రిని హత్య చేసి,శవాన్ని మాయం చేసి,మిస్సింగ్‌ కేసు పెట్టాలనుకున్నారు.ఆ తర్వాత ఎలాగూ పెన్షన్‌ తల్లికి వస్తుంది కాబట్టి హాయ్‌గా ఉండొచ్చని అన్న,చెల్లి పథకం వేశారు.ఈ క్రమంలో కూతురు తాను చదువుకున్న బయోకెమిస్ట్రీ మెదడుకు పదును పెట్టింది.ఎలాంటి గాయాలు లేకుండా,రక్తం రాకుండా మనిషిని చంపడం ఎలా..? అని వెతికింది.చివరకు తను అను కున్నది సాధించింది.ఉమ్మెత్త కాయలను పొడిగా చేసి తన తండ్రిని హత్య చేయొచ్చని తెలుసుకుని ఆచరణలో పెట్టింది.అతను మరణించాక అత్యంత క్రూరంగా తండ్రి శరీరాన్ని తల్లి,అన్నతో కలిసి మూడు కత్తులతో ముక్కలు ముక్కలుగా కోసి బకెట్లలో నింపారు.ఇంకేముంది ఆతర్వాత అనుకోకుండా పోలీసుల చేతికి చిక్కారు..

మరింత సమాచారం తెలుసుకోండి: