ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిపై ఇప్పుడు జరుగుతున్న తీవ్రస్థాయి చర్చ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా దిగిపోయాడు. అయితే అతను అందరి లాగా కాకుండా ఎప్పటిలాగే తనదైన శైలిలో స్టేట్మెంట్ ఇచ్చేశారు. వరదల అనంతరం బొత్స సత్యనారాయణ అన్న మాటలను ఉద్దేశించి పవన్ ఈ విధంగా మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదైనా అయి ఉండొచ్చు చెడ్డదైనా అయి ఉండొచ్చు కానీ వైసిపి ప్రభుత్వం మాత్రం ఇప్పటికిప్పుడు రాజధాని అమరావతి నుంచి మార్చనేకూడదు అని ఆయన అన్నారు.

రాజధాని తరలింపుపై వస్తున్న వార్తలతో ఆందోళన చెందిన రాజధాని రైతులు ఉన్న బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. నిన్న వారు పవన్ కళ్యాణ్ కూడా కలిసి తమ వాదనను వినిపించారు. చంద్రబాబు అమరావతిని ప్రపోజ్ చేసినప్పుడు ఆ నిర్ణయం ఏపీ అసెంబ్లీ కూడా ఆమోదించింది అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న గత ప్రభుత్వం తీసుకున్న నిర్నయానికి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిందని ఇప్పుడు కొత్తగా పాలనా బాధ్యతలు చేపట్టిన జగన్ కూడా పాటించాల్సి తీరాల్సిందే అని పవన్ డిమాండ్ చేశారు.

ఇక్కడ పవన్ ఒక లాజిక్ తో మాట్లాడారు. అంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మార్చుకుంటూ పోయే సంస్కృతికి శ్రీకారం చుడితే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజధాని మారిపోతూ ఉంటుంది అని మన రాష్ట్రానికి పూర్తిస్థాయి రాజధాని మాత్రం ఏనాడూ పూర్తి కాదని ఆయన అన్నారు. శాశ్వతంగా మంచి రాజధాని నిర్మించాల్సి ఉంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అసంబద్ధమైనదని అయినా దాన్ని సరిదిద్దాల్సింది పోయి రాజధాని లాంటి కీలక విషయాల్లో సంచలన నిర్ణయాలు తగవు అని ఆయన హెచ్చరించారు.

ఇలా జగన్ ను రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూనే పవన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు అందరం శిరసావహించక తప్పదు అని మరో వాదన కూడా వినిపించారు. సీమాంధ్రకు ఇష్టం లేకపోయినా రాష్ట్ర విభజన జరిగినట్లు…. దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసిన డిమానిటైజేషన్ ను సమర్పించినట్లు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మనందరం బందీలం అని కూడా ఆయన సంచలనాత్మకంగా అన్నారు. అయితే పవన్.... రాజధాని వంటి కీలక నిర్ణయాల సమయంలో ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరును ప్రస్తావించకుండానే జగన్ ను రాజధానిగా కొనసాగించమని డిమాండ్ చేయడం కొంత విచిత్రంగానే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: