అనారోగ్యం కారణంగా బీజేపీ సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే,ఇక ఆయన పార్థివదేహాన్ని ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి కైలాష్‌ కాలనీలో జైట్లీ నివాసానికి తరలించారు.ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలను ఈ రోజు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు.ఇక అభిమానులు,కార్యకర్తల సందర్శనార్దం అరుణ్ జైట్లీ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు.మధ్యాహ్నం 1.30గంటల వరకు అక్కడే ఉంచనున్నారని..అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని బీజేపీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఘనంగా జరగనున్నాయన్నారు.



జైట్లీ కడసారి చూపుల కోసం పలువురు రాజకీయ ప్రముఖులు,బీజేపీ కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోతీలాల్ వోహ్రా,ఎన్సీపీ అధినేత శరద్ పవార్,ఆర్ఎల్డీ నేత అజీత్ సింగ్,ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతదితరులు ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.నివాళులర్పించిన వారిలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌,కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌,కంభంపాటి రామ్మోహన్‌రావు,ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు..



ఈ సందర్భంలో పలువురు నేతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటు బాధసప్త హృదయముతో కన్నీటి నివాళులు అర్పించారు.జైట్లీ మరణం నిజంగా మనందరికి తీరని లోటని,ఓ మంచినాయకున్ని కోల్పయామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు..వృత్తిరీత్యా లాయర్ అయిన జైట్లీ ప్రధాని తొలి కేబినెట్లో కీలకమంత్రిగా,ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు.2014లో ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించి,మోదీకి అత్యంత ఆప్తుడయ్యాన్న విషయం తెలిసిందే..ఇక నిన్న హైదరాబాద్ లో పోలీస్ పాసింగ్ పెరేడ్ లో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అర్ధాంతరంగా తన పర్యటను ముగించుకొని ఢిల్లీ వెళ్లిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: