వరద సహాయకచర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రజలను నమ్మించేందుకు రైతు వేషం కట్టి , రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై, అనుచిత వ్యాఖ్యలు చేసిన పెయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన శేఖర్ చౌదరి ,  జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేవిధంగా రైతు వేషం లో తీవ్ర విమర్శలు చేశారు .  ఇటీవల వరద సమయంలో రైతు వేషం కట్టి … తాను  ఒక రైతునని ప్రజలను నమ్మించడం ద్వారా,  రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న భావన కలిగించే విధంగా  శేఖర్‌ చౌదరి నటించాడు .


 శేఖర్ చౌదరి పెయిడ్ ఆర్టిస్టు అని గుర్తించిన వైకాపా వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు . శేఖర్ చౌదరి వ్యవహారశైలి పై  ఫిర్యాదులు స్వీకరించిన  పోలీసులు విచారణ జరిపి  అతడిని అరెస్ట్ చేశారు.  పోలీసుల విచారణలో తాము కుట్రలో భాగంగానే రైతు వేషం కట్టి ప్రభుత్వాన్ని విమర్శించినట్లు శేఖర్ చౌదరి  అంగీకరించాడు. తనతో పాటు ప్రభుత్వంపై బురద జల్లేందుకు పలువురిని టీడీపీ ఉపయోగిస్తున్నట్టు చెప్పాడని సమాచారం. వివిధ వర్గాల ముసుగులో పెయిడ్ ఆర్టిస్టులే ప్రభుత్వాన్ని తిట్టిపోసి… ఈ వీడియోలను యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికలపై పోస్టు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు జరుగుతున్న కుట్రను అతడు బయటపెట్టినట్టు తెలుస్తోంది .


ప్రభుత్వ అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ పథకం ప్రకారం పెయిడ్ ఆర్టిస్టులను వాడుకుని , సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోందని వైకాపా వర్గాలు అంటున్నాయి . అందులో శేఖర్ చౌదరి లాంటి పెయిడ్ ఆర్టిస్టులు ఉపయోగిస్తుందని విమర్శిస్తున్నారు . టీడీపీ పార్టీ నాయకత్వం చేస్తోన్న దుష్ప్రచారం శేఖర్ చౌదరి లాంటి పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా స్పష్టమైందని అన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: