ఏపీలో ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో ప్రధాన అంశం ఏపీ రాజధానే.  బొత్స చేసిన వ్యాఖ్యలు అమరావతి పై పెద్ద దుమారాన్నే  రేపాయి. పైగా ఆ వ్యాఖ్యలకు తను  కట్టుబడి ఉన్నానని బొత్స  మరోసారి చెప్పడం కూడా.. అమరావతి పై ఆశ పెట్టుకున్నవాళ్ళ గుండెల్లో రైలు పరుగెడుతున్నాయి. అయితే రాజధాని రైతులు మాత్రం బొత్స చెప్పినట్లు రాజధాని మారిస్తే.. వైసీపీకి పుట్టగతులు కూడా లేకుండా చేస్తాం అన్నట్లు విరుచుకుపడుతున్నారు.  ఇంతకీ జగన్ మనసులో ఏముంది ?  రాజధాని విషయంలో జగన్  ఇప్పటికే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారని..  రాజధానినిగా అమరావతి నుండి మార్చికపోయినా.. అమరావతిలో చేసే పలు అభివృద్ధి పనులను  దోనకొండలో చేయాలని జగన్ భావిస్తున్నాడని,  వైసీపీ నాయకుల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో దోనకొండను రాజధానిగా పరిశీలిస్తే,  చంద్రబాబు తన అనుచరుల కోసం ముందుగానే అమరావతిలో భూములు కొనిపించి.. రాజధానిగా అక్కడ పెట్టారట.  పైగా అందులో పెద్ద అవినీతికి పాలపడ్డారట.  అందుకే రాజధానిని దోనకొండకు మారుస్తే ప్రజలకు, ప్రభుత్వానికి లాభం చేకూరుతుందని జగన్ అనుకుంటున్నట్టు పార్టీ నాయకులూ లీకులు వదులుతున్నారు.  అయితే  ఇప్పుడు రాజధాన్ని  దొనకొండకి మార్చి ఎప్పుడు కట్టాలని..? ఒకవేళ మారిస్తే.. జగన్ పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది.  మరి జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడా ? ఏమో జగన్ ఒకసారి ఫిక్స్ అయితే ఎవడి మాట వినడు అని ఇప్పటికే బోలెడెంత పేరు. 


రాజధాని మార్చాడని గ్యారింటీ లేదు.  ఇదే రాజధాని విషయంలో మొత్తం నాలుగు రాజధానులు కావాలని జగన్ అనుకుంటున్నారని ఇదే విషయాన్ని జగన్ ప్రధాని మోడీ దగ్గర కూడా  ప్రస్తావించారని ఆ పార్టీకు చెందిన నేత టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేసారు.  విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప లను రాజధానులుగా తీర్చిదిద్దాలని జగన్ భావిస్తున్నారట.  భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా పదవి  చేపట్టాక  ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నాడు జగన్. ముఖ్యంగా  తాను ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జగన్ రాజధాని విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడా ? తీసుకుంటే  అభివృద్ధి ఆగిపోయిందనే అపవాదును జగన్  ఎదురుకోవాలి. ఎలాగూ ప్రత్యేకహోదా విషయంలో జగన్ చేసేది ఏమి లేదు, ఇపుడు ఈ రాజధాని విషయంలో కూడా జగన్ తొందరపడితే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదట.     


మరింత సమాచారం తెలుసుకోండి: