రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్నలను  మార్క్‌ఫెడ్‌ తక్కువ ధరకు అమ్మిందని, దీనివల్ల ఆ సంస్థకు రూ.120 కోట్ల నష్టం వాటిల్లిందని కిసాన్‌ కాంగ్రెస్‌ ఆరోపించింది. గాంధీభవన్‌లో శనివారం జరిగిన సమావేశంలో కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర చైర్మన్‌ అన్వేశ్‌రెడ్డి మాట్లాడారు. జీవీ మొక్కజొన్నల అమ్మకాలతో కోళ్ల వ్యాపారులే లాభపడ్డారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. మరో పక్క పౌల్టీ ఫెడరేషన్‌, బ్రీడర్స్‌ అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారాయంటూ ఉపాధ్యక్ష పదవికి బండ్ల గణేష్ రాజీనామా చేయడం గమనార్హం. కోట్లకు కోట్లు వసూలు చేసి తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి కోళ్ల లెక్కల ప్రకారం 12 వేల టన్నుల మక్కలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 6వేల టన్నులే ఇచ్చారంటున్నారు.

తెలంగాణ పౌల్టీ ఫెడరేషన్‌, బ్రీడర్స్‌ అసోసియేషన్లు కేంద్రంగా జరిగిన మొక్కజొన్నల కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది. అందులో పౌలీ్ట్ర ఫెడరేషన్‌కు సంబంధించి రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని, సీబీఐ విచారణ జరిపించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్‌ సభ్యులు కొందరు ఆందోళన చేపట్టారు. దీంతో నాలుగు నెలలుగా అంతర్గతంగా సాగుతున్న కుమ్ములాటలు కాస్తా బహిర్గతమయ్యాయి. మక్కల వివాదం రోజురోజుకూ ముదురుతుండంటంతో బాధితులను చల్లబరచడానికి ఫెడరేషన్‌ బాధ్యులు రంగంలోకి దిగారు. ఈ నెల 23న బంజారాహిల్స్‌లోని ఒక హోటల్‌లో ఇరు వర్గాలు చర్చలకు కూర్చున్నాయి.

రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీ్‌పరావు, ఉపాధ్యక్షులు బండ్ల గణేశ్‌, జక్కా రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాసర్ల మోహన్‌రెడ్డి, కోశాధికారి కేఎ్‌సరెడ్డి తదితరులు పాల్గొని చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఫెడరేషన్‌కు చెడ్డపేరు వచ్చిందని, అవినీతి, అక్రమాలు జరిగాయంటూ బండ్ల గణేశ్‌ సీరియస్‌ అయ్యారు. తప్పుడు లెక్కలు రాశావంటూ కేఎ్‌సరెడ్డిపై దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొని పరస్పరం తోసుకున్నారు. ఆ వెంటనే తాను ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానంటూ బండ్ల గణేశ్‌ లేఖ రాసి ఇచ్చి వెళ్లిపోయారు. అనంతరం అక్రమాలపై బాధితులు నిలదీశారు. కార్యవర్గం రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
 
రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు లేకుండానే పౌల్టీ ఫెడరేషన్‌కు, బ్రీడర్స్‌కు మక్కలను క్వింటాలుకు రూ.1800 చొప్పున 41.60 లక్షల క్వింటాళ్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారంలో రూ.200 కోట్ల కుంభకోణం జరిగిందని, రాజకీయ పలుకుబడి ఉన్న బడాబాబులే ఇందులో లబ్ధి పొందారని, చిన్న, సన్నకారు పౌలీ్ట్ర రైతులకు అన్యాయం జరిగిందనేది ప్రధాన ఆరోపణ.

మరింత సమాచారం తెలుసుకోండి: