నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ టార్గెట్గా కుట్ర జరుగుతుందా ? ఎన్టీఆర్ ను ఇప్పటికే పూర్తిగా పక్కన పెట్టేసిన చంద్రబాబు, బాలకృష్ణ ఫ్యామిలీలు భవిష్యత్తులో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఎన్టీఆర్ పేరు సైతం త‌లవకుండా ప్రయత్నాలు చేస్తున్నారా ? ఎన్టీఆర్ ను సాధ్యమైనంత వరకు అణగదొక్కే ప్రయత్నాలు మొదలయ్యాయా ? అంటే తాజా పరిణామాలు అవున‌నే స్పష్టం చేస్తున్నాయి. గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి అటు చంద్రబాబు ఇటు.... బాలయ్య వీలున్నప్పుడల్లా ఎన్టీఆర్‌ను తొక్కుతున్నారు.  చంద్రబాబు ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు తన కుమారుడు లోకేష్‌ను బాగా ప్రమోట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు.


చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా లోకేష్‌ను ముందు పెట్టడం నందమూరి ఫ్యామిలీ వీరాభిమానుల‌కు సైతం నచ్చలేదు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయానికి ఇది కూడా ఒక కారణం అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా టిడిపికి చేయాల్సిందల్లా చేశారు. 2009 ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ను పక్కన పెట్టిన చంద్రబాబు 2014 ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ను తీసుకువచ్చి ప్రచారం చేయించుకున్నారు. ఇక తాజా ఎన్నికల్లో ఎన్టీఆర్, పవన్ ఇద్దరు బాబుకు దూరమయ్యారు. 


ఈ క్ర‌మంలోనే బాబు ఒంటరిపోరుకు వెళ్లి ఘోర‌ప‌రాజ‌యం మూటగట్టుకున్నారు. ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ను సైడ్ చేసే ప్రయత్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నట్టు కనిపిస్తే ఇప్పుడు ఎన్టీఆర్ టార్గెట్ గా బాల‌య్య చిన్న అల్లుడు భ‌ర‌త్ చేసిన వ్యాఖ్యలు సైతం టిడిపి వర్గాల్లో, నందమూరి అభిమానుల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. అసలు జూనియర్ కు రాజకీయాలు ఎందుకు అనే అర్థంవచ్చేలా మాట్లాడారు భరత్. ఒకదశలో ఎన్టీఆర్ మాకు అవసరం లేదని కుండబద్దలుకొట్టారు.


ఎన్టీఆర్ వ‌స్తేనే టీడీపీ జ‌వ‌స‌త్వాలు పుంజుకుంటుంద‌ని తాము అనుకోవ‌డం లేద‌ని.. ఇప్ప‌టికే టీడీపీలో ఉన్న నాయ‌కులు స‌రిపోతార‌ని చెప్ప‌డంతో పాటు ప‌రోక్షంగా అస‌లు ఎన్టీఆర్ అవ‌స‌ర‌మే పార్టీకి లేద‌న్న‌ట్టుగా చాలా లైట్‌గా మాట్లాడాడు. భ‌ర‌త్ వ్యాఖ్య‌లు చూస్తుంటే నంద‌మూరి, నారా ఫ్యామిలీలు రెండూ ఎన్టీఆర్‌ను ఎంత మాత్రం ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. 


కేవ‌లం హ‌రికృష్ణ మృతిచెందిన‌ప్పుడు బ‌య‌ట ప్ర‌పంచం దృష్టిలో తాము విల‌న్లం కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే వాళ్ల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్న‌ట్టు న‌టించారే త‌ప్పా ఎన్టీఆర్ వ‌స్తే త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తుతో పాటు లోకేష్‌కు క‌ష్ట‌కాలం త‌ప్ప‌ద‌న్న విష‌యం వాళ్ల‌కు అర్థ‌మైన‌ట్టు ఉంద‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. నంద‌మూరి, నారా ఫ్యామిలీల్లో ఎన్టీఆర్ గురించి చ‌ర్చ జ‌ర‌గ‌క‌పోతే భ‌ర‌త్ అంత డేర్‌గా ఎన్టీఆర్ అక్క‌ర్లేద‌ని చెప్ప‌డ‌ని కూడా కొంద‌రు సందేహిస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్‌కు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు వీళ్లు సిద్ధంగా లేద‌ర‌న్న‌ది మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: