ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అనేక మార్పులు జరుగుతున్నాయి.  రాజధానిని అమరావతిలో నిర్మించే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పడంతో పాటు, అమరావతిని ఈ సమయంలో నిర్మించడం వలన రాష్ట్రానికి ఆర్ధికంగా భారం అవుతుందని చెప్పడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.  రాజధాని కోసం ఏకంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు.  


ఇలా వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్లలో ఒక్క టిడిపి వాళ్ళే కాదు వైకాపా పార్టీకి చెందిన ఎంతోమంది ఉన్నారు.  వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీకి చాలామంది ఓట్లు వేశారు.  కానీ, చివరకు అక్కడ జరిగింది వేరు.  పార్టీ ఇప్పుడు రాజధాని విషయంలో రకరకాల మాటలు మాట్లాడుతుండటంతో.. చంద్రబాబు చెప్పిన కృత్రిమ వరద కరెక్టేనేమో అని జనాలు అనుకుంటున్నారు.  


వరదలు వస్తే రాజధానిని మారుస్తారా అని బాబు ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు.  ఎన్నో చోట్ల ఇలా వరదలు వస్తూనే ఉంటాయి.  అంతమాత్రం చేత రాజధానిని మారిస్తే దాని వలన నష్టపోయేది ప్రజలే అని బాబు అంటున్నారు.  ఈరోజు బొత్సా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజధాని మార్పుకు తప్పదని తెలుస్తోంది.  దీంతో అమరావతిలోని వెలగపూడి వద్ద వైకాపా నేతలు రైతులు ధర్నాకు దిగారు. 

సొంతపార్టీకి చెందిన నేతలు, రైతులు ధర్నాకు దిగడంతో వైకాపా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి.. రైతులు పొలాలు ఇచ్చారని, వైకాపా ఓటువేసి గెలిపించింది ఇందుకేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.  రాజధానిని మారిస్తే చూస్తూ ఊరుకోబోమని అంటున్నారు రైతులు.  మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఇప్పటి వరకు అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేసినట్టు కనిపించడం లేదు.  కానీ వైకాపా పార్టీకి చెందిన రైతులు ఇలా ధర్నాకు దిగడం విశేషం.   


మరింత సమాచారం తెలుసుకోండి: