రాజధాని మన అందరిదీ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏ ఒక్కరి సొంత ఆస్తి కాదని  కుల మతాల కతీతంగా ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల అభిమతం గా ఏర్పడబోయే  ప్రదేశం మన రాష్ట్ర రాజధాని అని శ్రీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.   రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలు పట్ల కట్టు బడి ఉన్నానని ఎట్టి పరిస్థితిలోనూ మడమ తిప్పేది లేదని శ్రీ బొత్స సత్యనారాయణ చెప్పారు.

 అమరావతి కి  కృష్ణా నది వరద నుండి ముప్పు వాటిల్లే ప్రమాదం చాలా అధికంగా ఉందని, 8 లక్షల క్యూసెక్కుల నీటికి వరదతో  అతలా కుతలమైన ఈ ప్రాంతం ఒకవేళ 11 లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఏమై పోతుందని ప్రశ్నించారు.

శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని గత తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని పై శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదని  మాజీ మంత్రి శ్రీ నారాయణ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రాతిపదికగా తీసుకుని అమరావతి రాజధానికి సరైన ప్రాంతం గాఎంచుకుంది అని వరద ముప్పు గురించి ఎంత మంది చెప్పినా వినకుండా ఏకపక్షం గా నిర్ణయం తీసుకుందని  శ్రీ బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

రాజధాని విషయంలో  జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితం గా ఉన్నాయని శ్రీ బొత్స సత్యనారాయణ అన్నారు.   ఏది ఏమైనా రాజధాని నిర్మాణం విషయంలో తమ ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతుంది అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని పనిచేస్తామని ఆయన చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: