ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది.ఆయన తల్లి మహాలక్ష్మమ్మ (73) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.గత కొన్ని నెలలుగా ఆమె వయస్సు రిత్యా ఏర్పడ్ద సమస్యలతో సతమతమౌతుందట,ఈ క్రమంలో కొద్దిరోజులుగా ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహాలక్ష్మమ్మ ఇవాళ సాయంత్రం మరణించారు.వారి కుటుంబ సభ్యులను పలకరించగా సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలిపారు..మంత్రి వెల్లంపల్లి మాతృమూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు.వెల్లంపల్లి కుటుంసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మహాలక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ వార్త తెలిసిన వెంటనే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు,మరోవైపు ఎమ్మెల్యేలు పార్థసారధి,మేరుగ నాగార్జున తదితరులు మంత్రి వెల్లంపల్లిని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియచేసారట.. 




మంత్రి వెల్లంపల్లి తల్లి మహాలక్ష్మమ్మ పార్ధీవ దేహానికి వైఎస్ఆర్ సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతం రెడ్డి నివాళులు అర్పించి, మంత్రికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విషాద ఘటన గురించి తెలిసిన వెంటనే  వెల్లంపల్లి శ్రీనివాసరావును పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తో పాటుగా పలువురు నాయకులు కూడా ఫోన్ లో పరామర్శించారు. మహాలక్ష్మమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.కాగా.. రేపు అనగా సోమవారం నాడు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. 




సోమవారం బ్రాహ్మణ వీధిలోని మంత్రి స్వగృహం నుంచి బంధువులు,శ్రీనివాస రావు సన్నిహితులు,స్నేహితుల సమక్షంలో అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అక్కడే స్థానికంగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముగియనున్నాయని తెలిపారు..మాతృమూర్తి అంటే ఎంతో ప్రేమ వున్న శ్రీనివాసరావు ఈ సంఘటనతో  తీవ్రమైన విషాదంలో వున్నారని,ఆయనకు అత్యంత సన్నిహితంగా వున్న కొందరు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: