ఆంటిగ్వాలోకి సర్ వివ్ రిచర్డ్స్ స్డేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తన ఆటపై నిరాశ చెందాడని టీమిండియా క్రికెటర్ రాహుల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. టీమిండియా క్రికెట్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ బాలేదని చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి.  


అయితే తన బ్యాటింగ్‌తో పాటు టెక్నిక్‌కు సంబంధించి రాహుల్‌ స్పందిస్తూ అతని బ్యాటింగ్ టెక్నిక్ లో ఎలాంటి లోపం లేదని చెప్పుకొచ్చాడు. అయితే అతని స్కోర్ భారీగా మారకపోవడం అతనికి నిరాశ కల్గిస్తుందని అతను చెప్పాడు. రాహుల్ మాట్లాడుతూ 'నేను బాగా ఆడుతున్న, కానీ ఓపిక కూడా ఉండాలి 80 బంతుల్లో 38 పరుగులు చేశాను ఎక్కువ బంతులు ఆడితే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. 


తదుపరి టెస్టులో ఓపికతో అది ఎక్కువ రన్స్ సాదించేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్. వెస్టిండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన రాహుల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసి ఔటయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: