సైబర్ నేరాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో పట్టణాలకే పరిమితమైన ఈ సైబర్ నేరాలు క్రమక్రమంగా గ్రామాలలో ఉండే అమాయక ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాలలో ఉండే రైతులు, మహిళలు, రోజు వారి పనులకి వెళ్ళే వాళ్ళు ఈ సైబర్ నేరగాళ్ళ వలన  కూడబెట్టుకున్న డబ్బు పోగొట్టుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ రైతు తాను డబ్బు పోగొట్టుకున్న  ఓ సంఘనని ఉదాహరణ గా తీసుకుంటే..

 Image result for cyber crime banking poster

పశ్చిమగోదావరి జిల్లా పెరవలికి చెందిన సాయి అనే రైతు పొలం పనులు చేసుకుంటున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సాయికి ఫోన్ చేశాడు. తాను ఫలానా బ్యాంక్  నుంచీ మాట్లాడుతున్నట్టుగా పరిచయం చేసుకున్నాడు. మీ ATM కార్డులో కొన్ని లోపాలు ఉన్నాయని, ఇకపై మీ పాత ATM పని చేయదని,  రెండు రోజుల్లో మీకు కొరియర్ ద్వారా కొత్త ATM వస్తుందని నమ్మించాడు. మీ బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పండి అంటూ అడగగానే, బ్యాంకు అధికారే మాట్లాడుతున్నాడు అనుకున్న సాయి. అతడు అడిగిన కార్డ్ నెంబర్, కార్డ్ వెనుకాల ఉన్న CVV నంబర్, అతడి ఫోన్ కి వచ్చే మెసేజ్, అన్నీ చెప్పేశాడు. దాంతో క్షణాలలో సాయి ఖాతాలో సొమ్ము మాయమయ్యిపోయింది. లబోదిబో మన్నా ఉపయోగం లేకుండా పోయింది ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సాయి ఒక్క ఫోన్ కాల్ తో డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు.

 Image result for cyber crime banking poster

ఒక సాయి మాత్రమే కాదు గ్రామాలలో ఉంటున్న ఎంతోమంది అమాయకులు, డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు రోజుకి కొన్ని వందల్లో జరుగుతున్నాయి. చదువు లేని వారు మాత్రమే కాదు చదువుకున్న వారు కూడా మోసగాళ్ళ మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకుంటున్న సంఘటనలు అనేకం.

 

ఫోన్ చేసే వ్యక్తులు సహజంగా అడిగే ప్రశ్నలు :

 మేము ఆధార్ సెంటర్ నుంచీ మాట్లాడుతున్నాం, (లేక) బ్యాంక్ నుంచీ మాట్లాడుతున్నాం.(లేక) ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ నుంచీ మాట్లాడుతున్నాం అంటూ ఫోన్ చేస్తారు. మీ ఫోన్ నెంబర్  మీ ఆధార్ , బ్యాంక్ ఖాతాలకి లింక్ అవ్వలేదు.  మీకు ప్రభుత్వం నుంచీ రావాల్సిన సౌకర్యాలు , పధకాలు పొందాలంటే తప్పకుండా లింక్ చేయాల్సిందే మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నెంబర్ చెప్పమని అడుగుతారు. తరువాత మీ మొబైల్ కి ఓ నెంబర్ వచ్చింది అది చెప్పండి అనగానే మనం మొబైల్ కి వచ్చిన సందేశం చెప్తే వెంటనే మీ ఖాతాలో ఉన్న డబ్బు మాయం అవుతుంది. అయితే మీకు ఫోన్ చేసి ఆధార్ లింక్ చేసే అవసరం ఏ బ్యాంక్ కి గాని, ప్రభుత్వ కార్యాలయానికి కానీ ఉండదు. మీకు మీరుగా ఆయా కార్యాలయాలకి వెళ్లి అడిగితే  తప్ప ఎవరూ మీ ఆధార్ లింక్ చేయరు. ఇలాంటి ఫోన్ లు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీకు ఏదన్నా సందేహం కలిగితే దగ్గరలోని ఆయా బ్యాంక్ అధికారులని సంప్రదించండి.

 Image result for cyber crime banking poster

మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి :

మీ ఫోన్ నెంబర్ కి ఓ నెంబర్ వచ్చింది చెప్పండి అని అడిగినపుడు మీరు తొందరపడి ఆ నెంబర్ చెప్పకండి. ఏ కారణం చేత అయినా సరే అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ ఫోన్ కి వచ్చిన నెంబర్ ని లేదా ఆ నెంబర్ నా మాకు తిప్పి పంపండి చెప్పినప్పుడు మీరు పంపవద్దు.

నా పేరు సందీప్ నేను కంప్యూటర్ లో అప్లికేషను పూర్తి చేస్తూ నా నెంబర్ కి బదులుగా మీ నెంబర్ ఇచ్చేశాను మీ ఫోన్ నెంబర్ కి ఓ నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ చెప్పి కొంచం పుణ్యం కట్టుకోండి అంటూ ఫోన్ చేస్తూ ఉంటారు. అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కూడా మీరు అప్రమత్తంగా వ్యవహరించాలి. వారికి ఎలాంటి బదులు మీరు ఇవ్వకూడదు.

బ్యాంక్ అధికారులుగా ఫోన్ చేసి మీ ATM కార్డు పైన కనపడే 16 అంకెలు కానీ, కార్డు వెనకాల ఉండే మూడు అంకెలు (CVV) నెంబర్ అడిగితే  ఎవరికీ చెప్పవద్దు. మీ బ్యాంక్ ఖాతా వివరాలు, మీరు జరుపుతున్న లావాదేవీలు కూడా ఎవరికీ చెప్పవద్దు. ఎందుకంటే. . ఏ బ్యాంక్ కూడా మీ వివరాలని ఫోన్ లో అడిగి తెలుసుకోవు.

 ATM  ద్వారా మీరు డబ్బులు పంపాల్సి వస్తే సమయం పట్టినా వేచి ఉండండి, అంతేకాని ఎవరైనా మా ఖాతా ద్వారా డబ్బు పంపుతాం అంటూ మిమ్మల్ని అడిగితే వద్దని చెప్పండి.

మీరు లక్కీ డ్రాలో ఫోన్ గెలుచుకున్నారు , కేవలం 5 రూపాయలు మా ఖాతాలో జమచేస్తే చాలు అంటూ ఫోన్ చేస్తారు. మిమ్మల్ని నమ్మించి మీ ద్వారా వారి ఖాతాలో డబ్బు వేసేలా చేస్తారు. దాంతో మీ ఖాతా నెంబర్ తీసుకున్న వాళ్ళు తిరిగి మీ ఖాతాలో 100 రూపాయలు జమచేసి డబ్బు వచ్చిందా అంటూ మళ్ళీ ఫోన్ చేస్తారు. ఈ క్రమంలో మీరు వారిని నమ్మేలా చేస్తారు. దాంతో చివరిగా మీ సెల్ కి ఒక నెంబర్ వచ్చింది ఆ నెంబర్ చెప్పండి అంటూ మీ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం మాయం చేస్తారు. ఇలాంటి  ఫోన్స్ వచ్చినప్పుడు వారితో మాటలు కలపవద్దు ,వెంటనే కాల్ కట్ చేయండి. ఎవరూ మనకి ఊరికినే ఫోన్ లు ,గిఫ్ట్ లు ఇవ్వరు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొండి.

మీకు ATM నుంచీ డబ్బులు తీయడం రాకపోతే మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళని తీసుకుని వెళ్లి డబ్బులు తీయండి, ఒకటికి రెండు సార్లు వారిని అడిగి మీరే డబ్బులు తీసుకునే విధానం తెలుసుకోండి. అంతేకాని ATM సెంటర్ లో మీతో పాటు డబ్బులు తీసుకునే వ్యక్తులకి కార్డ్ ఇచ్చి, మీ పిన్ నెంబర్ చెప్పి డబ్బులు తీసుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితులలో చేయకండి.

మీ ATM పిన్ నెంబర్ మీ వ్యక్తిగతమైనది, చివరికి బ్యాంక్ అధికారులకి కూడా ఆ వివరాలు చెప్పకండి. ఒకవేళ మీరు మీ ఖాతానుంచీ డబ్బు పోగొట్టుకున్నా , అపరిచిత వ్యక్తుల నుంచీ కాల్స్ వచ్చినా సరే వెంటనే బ్యాంక్ అధికారుల వద్దకి వెళ్ళండి వారికి జరిగింది చెప్పి , వారి సూచనలు పాటించండి. దగ్గరలోని పోలీసు అధికారులకి ఫిర్యాదు చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: