కూర రుచిగా రావాలంటే అందులోకి కావలసిన పదార్దాలు అన్ని సరిగ్గా వేయాలి అప్పుడే దానికి రుచి వండిన వారికి పేరు వస్తుంది.ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే,ఒక్కప్పుడు ఫోనంటే క్షేమసమాచారాలు కనుక్కునే సాధనం,కాని ఇప్పుడు అదే సమస్తం.దానికితోడు సెల్ తయారుచేసే కంపనీలు పోటిపడి అద్బుతమైన ఫీచర్స్ ను అందిస్తున్నాయి.కొత్తకొత్త యాప్స్ ను సంస్దలు కనుకొంటున్నాయి.అవి క్లిక్ ఐ ఎంతలా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయె ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.అంతలా ప్రతివారికి నచ్చిన యాప్స్ లో,వాట్సాప్ ఒకటి.దానివల్ల ఎంత  మేలుందో,అంతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతివారు.అందుకే ఇప్పుడు ఇబ్బందులను తగ్గించే,న్యూ ఫీచర్ ద్వారా ముస్తాబై మనముందుకు వస్తుంది వాట్సప్.



ఇప్పుడున్న వర్షన్ ప్రకారం.ఎవరో క్రియేట్ చేసిన గ్రూపులో మన నంబర్ యాడ్ చేస్తారు.తమకు సంబంధంలేని గ్రూపులో కూడా మన ఇష్టంలేకుండా చేరిపోతాం.తర్వాత గ్రూప్‌ నుంచి బయటకు వచ్చినా మళ్లీ యాడ్ చేసేస్తుంటారు.మన ఫోన్‌ బుక్‌లో లేని నంబర్‌తో కూడా ఏదైనా గ్రూప్‌లో యాడయ్యె అవకాశం ఉంది పాత సెట్టింగ్స్ లో,అది కూడా మన అనుమతి లేకుండా. ఇక ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతోంది వాట్సాప్.కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్‌తో ఏదైనా గ్రూపులో చేరాలంటే సదరు యూజర్ అనుమతి తప్పనిసరి అయిపోతుంది ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం..ఇప్పుడు వచ్చిన ఫీచర్ ప్రకారం ఫోన్‌ బుక్‌లో నంబరు ఫీడ్ చేసి ఉన్న వ్యక్తి  క్రియేట్‌ చేసిన గ్రూపులో మాత్రమే మనల్ని యాడ్‌ చేసే అవకాశం ఉన్నా..అందుకు మన అనుమతి తప్పనిసరి.



మనల్ని గ్రూప్‌లోకి ఆహ్వానిస్తున్నట్టు మెసేజ్‌ వచ్చిన 72 గంటల్లోగా దానిని మనం అంగీకరించకపోతే ఆ గ్రూపులో మనం చేరే అవకాశం ఉండదు.అంతేకాదు,ఈ నంబరును గ్రూపుల్లో యాడ్‌ చేయవద్దు అనే ఆప్షన్‌ను ఎంచుకునే వీలును కూడా యూజర్లకు కలిపించనుంది వాట్సాప్.దీనికి వేలిముద్ర సాయంతో వాట్సాప్‌ను అన్‌లాక్‌ చేసే సదుపాయం కల్పిస్తోంది.స్పామ్‌ మెసేజ్‌లను తేలికగా గుర్తించేందుకు వాట్సాప్‌ ‘ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డెడ్‌’ఫీచర్‌ను ప్రారంభించింది.ఇకపోతే ఇప్పటి వరకు ఒక వాయిన్ మెసేజ్ వింటు మరో వాయిస్ వినాలంటే మళ్లీ వెనక్కి వెళ్లి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉండగా వాట్సాప్‌లో ఒకేసారి అనేక వాయిస్‌ మెసేజ్‌లు వరుసగా వినిపించే సరికొత్త ఫీచర్‌ను కూడా తెస్తున్నారు.ఇలా,రోజుకో అప్‌డేట్‌తో తన యూజర్ల సంఖ్యను క్రమ క్రమంగా పెంచుకుంటూ పోతోంది వాట్సాప్..



మరింత సమాచారం తెలుసుకోండి: