తెలుగుదేశంపార్టీ ఎంపిలు రాష్ట్రపతి భవన్ లో కామిడీ షో చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయటానికి గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్  కలిశారు. సరే గడచిన ఏడాదిన్నరగా రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని, విధ్వంసాలు తప్ప అభివృద్ధి జరగటం లేదని, ప్రతిపక్షాల నేతలను టార్గెట్ గా చేసుకుని కేసులు పెడుతున్నారని... ఇలా అనేక అంశాలపై ఫిర్యాదులు చేశారు. రాష్ట్రపతిని కలవటం, ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయటం ప్రతిపక్షాలకున్న హక్కు. కాబట్టి ఆ విషయంలో వీళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఆ తర్వాత మీడియాను కలసిన ఎంపిలు చేసిన వ్యాఖ్యలే పిచ్చ క్యామిడీగా ఉన్నాయి.

 

నిజానికి టిడిపి ఎంపిలు చేసిన ఫిర్యాదులోని అంశాలే చాలా సిల్లీగా ఉన్నాయి. ప్రజావేదికను కూల్చేశారని, ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పులు పట్టాయని, ఎంఎస్ఓలను బెదిరించి ఆంధ్రజ్యోతి-ఏబిఎన్, టివి-5, మహాన్యూస్ చానళ్ళను నిలిపివేయించారని, బిసి నేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రల అరెస్టు, అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవటం, భూములు కబ్జా చేయటం లాంటి అంశాలపై ఫిర్యాదులు చేయటమే విచిత్రంగా ఉంది. ఫిర్యాదులోని అంశాలేవీ రాష్ట్రపతి జోక్యం చేసుకునేంత తీవ్రమైనవి కావు.  టిడిపి ఎంపిల వైఖరి చూస్తుంటే బిజెపితో జతకలిసేందుకు చంద్రబాబునాయుడు పడుతున్న ఆతృతలో భాగంగానే రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం జోక్యాన్ని కోరుకుంటున్నట్లుంది.

 

సరే  ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఎంపిల ఫిర్యాదు సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తనకు అంతా తెలుసన్నారట. తనకున్న మార్గాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్లు రాష్ట్రపతి చెప్పారని ఎంపిలు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై తన దగ్గరున్న సమాచారం ఆధారంగా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట. తన దగ్గర చేసిన ఫిర్యాదులనే  పార్లమెంటులో కూడా  ప్రస్తావించమని రాష్ట్రపతి చెప్పారట. అలాగే సంబంధిత మంత్రిత్వశాఖలకు కూడా ఫిర్యాదు చేయమని రాష్ట్రపతే  తమకు చెప్పారని  టిడిపి ఎంపిలు చెప్పటమే పిచ్చ క్యామిడీగా ఉంది. నిజానికి తన దగ్గరకు ఎవరు వచ్చినా చెప్పింది వింటారే కానీ పై విధంగా ఎప్పుడు చెప్పిన దాఖల్లాలేవు.

 

రాష్ట్రపతితో భేటి తర్వాత టీడీపీ ఎంపిలు చెప్పిన విషయాలనే రాష్ట్రపతి భవన్ ఓ ప్రెస్ రిలీజ్ ద్వారా చెబితే నమ్మాలి కానీ ఎంపిలు చెప్పుకుంటే ఉత్త డొల్ల అనే అర్ధం. పైగా కరోనా వైరస్ సమయంలో ఎవరికీ అపాయిట్మెంట్ ఇవ్వని రాష్ట్రపతి తమకు ఇచ్చారని చెప్పుకోవటమే ఇంకా విచిత్రం. మొత్తానికి రాష్ట్రపతి భేటి విషయంలో టిడిపి ఎంపిలు క్యామిడి చేసిన విషయం అందరికీ తెలిసిపోయింది. తమతో భేటి విషయంలో ఎలాగూ రాష్ట్రపతి భవన్ నుండి ప్రెస్ రిలీజ్ వచ్చే అవకాశం లేదు కాబట్టి తామిష్టం వచ్చినట్లు చెప్పేశారని అర్ధమైపోతోంది. కరోనా కాలంలో ఎవరినీ కలవని రాష్ట్రపతి   తమకు మాత్రమే అపాయిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని స్వయంగా రామ్ నాథే చెప్పారని కూడా టిడిపి ఎంపిలు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. పనిలో పనిగా రాష్ట్రానికి  ప్రత్యేకహోదా, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ లాంటివి కూడా కేంద్రంతో చెప్పి మంజూరు చేయించమని టిడిపి ఎంపిలు అడిగి ఉంటే బాగుండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: