కరోనా విపత్తు ప్రపంచాన్ని ఎలా కమ్మేసిందో .. సరిగ్గా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నిస్తేజం అలుముకుంది. ఊహించని విపత్తుగా వచ్చిపడిన కరోనాతో జనాలు ఎలా కకలా వికలం అవుతున్నారో, సరిగ్గా అదే విధంగా తెలుగుదేశం పార్టీలోని నాయకులూ కలత చెందుతున్నారు. పార్టీ ఎప్పుడూ ఎదుర్కొని గడ్డు పరిస్థితులను ఇప్పుడు ఎదుర్కొంటూ వస్తోంది. మొన్నటి వరకు అధికార పార్టీ అని దర్పం చూపించిన నాయకులు ఇప్పుడు ఇల్లు దాటి కాలు బయట పెట్టేందుకు వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక పార్టీ పిలుపు ఇస్తున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన లు, ధర్నాలు, నిరసనలు తెలిపేందుకు ఏ ఒక్కరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడమే కాకుండా వాటికి సంబంధించిన సాక్ష్యాలను బయటకు తీస్తూ వైసీపీ ప్రభుత్వం టిడిపి కీలక నాయకులు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా, అందరి అవినీతి వ్యవహారాలను బయటపెట్టి,  జైలుపాలు చేయాలని చూస్తోంది. 

 

IHG


ఇది కక్షసాధింపు చర్య అనుకున్నా... అవినీతికి సంబంధించిన ఆధారాలు కూడా బయట పడుతుండడంతో, ప్రజల్లోనూ టీడీపీకి సానుభూతి దొరకడం లేదు. ఈ వ్యవహారాల్లో చిక్కుకున్న నాయకులను వెనకేసుకు వస్తూ లోకేష్, చంద్రబాబు వంటి వారు మాట్లాడుతున్నా, ప్రయోజనం ఏమి లేదన్నది ఆ పార్టీ నాయకులు మాట. గతం కంటే టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కాస్త మెరుగైనట్టుగానే కనిపిస్తున్నా, వైసిపి దూకుడు ముందు ఆయన నిలబడలేరు అనేది వాస్తవం. టిడిపి భవిష్యత్తుపై నాయకులలోనూ, బెంగ పెరిగిపోతోంది. 2024 ఎన్నికల నాటికి కూడా పార్టీకి అధికారం దక్కడం చాలా తక్కువ అనే అభిప్రాయం చాలామంది నాయకుల్లో వచ్చేసింది. 

IHG


అలాగే  వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో.. గతంలో ఏ ప్రభుత్వం చేయనంత స్థాయిలో పథకాలను అమలు చేసుకుంటూ వెళుతోంది. ప్రజలు ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకుండా, అన్ని రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. కరోనా విపత్తు సమయంలోనూ, ఎక్కడా తడబడకుండా పరిపాలనను సాఫీగా చేసుకుంటూ వెళుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలోనూ దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు దక్కించుకుంది. దిశా వంటి చట్టాలను రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పోరాడేందుకు ఏ అవకాశాలు కనిపించడం లేదు. 

IHG


అమరావతి విషయాన్ని హైలెట్ చేసి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా చేద్దాం అనుకున్నా, ఆ ఉద్యమం ఒక అమరావతి ప్రాంతంలో, ఒక సామాజిక వర్గం ప్రజలు తప్ప మిగతా వారు ఎవరూ  ఆ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, మూడు రాజధానుల విషయంలో ఎన్ని అడ్డుకట్టలు వేద్దామనుకున్నా, చివరికి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారాలు గవర్నర్ పరిధిలో ఉన్నాయి. ఆయన నిర్ణయంపైనే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానులు ఇలా అన్నీ గవర్నర్ కోర్టులోనే ఉన్నాయి. 

IHG


ఈ విషయాల్లో కేంద్రం మద్దతు కూడా, ఏపీ ప్రభుత్వానికే ఉన్నట్టుగానే సంకేతాలు వస్తుండటంతో, తెలుగుదేశం పార్టీలో మరింతగా ఆందోళన కనిపిస్తోంది. ఈ విషయాలపై ఎంతగా పోరాడినా, ఫలితం ఉండదని, పైగా మిగతా ప్రాంతంలో వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతో మొక్కుబడిగా గవర్నర్ కు లేఖ లతో బాబు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గన్నవరం వంటి నియోజకవర్గాల్లోనూ, కనీసం ఇన్చార్జిని కూడా నియమించుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉండిపోయింది. మాజీ మంత్రులను అక్కడ ఇన్ఛార్జిలుగా నియమిద్దామని చూస్తున్నా, వారు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో, టిడిపిలో మరింతగా ఆందోళన పెరిగిపోతుంది.


 ప్రస్తుతం చంద్రబాబు కరోనా కారణంగా హైదరాబాద్ లోని తన నివాసానికి పరిమితమైపోవడం, మొదట్లో ఉన్నంత యాక్టివ్ గా ఇప్పుడు కనిపించకపోవడం వంటి పరిణామాలన్నీ, పార్టీ నాయకులకు మరింత ఆందోళన పెంచేలా తయారయ్యాయి. ఇదే సమయంలో శత్రు శేషం ఎవరూ యాక్టివ్ గా లేకుండా చూసుకోవడంలో జగన్ సక్సెస్ అవుతూ వస్తున్నారు. కరోనా కారణంగా వలసలకు కాస్త బ్రేక్ పడినట్టుగానే  కనిపించినా, భవిష్యత్తులో పెద్దఎత్తున నాయకులు టిడిపికి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నాలుగేళ్ల పాటు పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపించాలంటే, అది సాధ్యమయ్యే పని కాదు అన్నది టిడిపి నాయకుల అభిప్రాయం.


 ఈ నాలుగేళ్లలో పార్టీ పరిస్థితి చెప్పుకోలేనంత స్థాయిలో ఘోరంగా తయారవుతుందని, తెలంగాణలో ప్రస్తుతం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో, అదే పరిస్థితి వచ్చింది అని వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ 2024 నాటికి కూడా కోలుకోవడం కష్టమే అనేది తెలుగు తమ్ముళ్లు కూడా బలంగా ఫిక్స్ అయినట్టుగానే కనిపిస్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ స్థానాన్ని తాము ఆక్రమించాలి అనే ఉద్దేశంలో బీజేపీ స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: