డైరెక్టర్ పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ టాలీవుడ్ లో ఇంకొకరు ఉండరంటే సందేహించాల్సిన పనిలేదు. పూరి కి హిట్ ఫ్లాప్ లతో పని లేదు. అనుకుంటే అయిదు నెలల్లో సినిమాను రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడు. ఈ కథ నచ్చుతుందా..ఈ సినిమా ఆడుతుందా అని లెక్కలేసుకోడు. అందుకే దమ్ము ధైర్యం ఉన్న దర్శకుడని అందరు అనుకుంటారు పూరిని చూసి. వంద కోట్లు సంపాదించినా కూడా చాలా సింపుల్ గా ఉండటం పూరికే సాధ్యం.  గీత గోవిందం బ్లాక్ బస్టర్. కానీ డైరక్టర్ పరుశురామ్ సినిమా ఇఫ్పటి వరకు పట్టాలు ఎక్కలేదు. అలాగే భరత్ అనే నేను సూపర్ హిట్. రంగస్థలం సూపర్ డూపర్ హిట్. భాగమతి హిట్ సినిమా. 

ఆర్ ఎక్స్ 100 కలెక్షన్ కింగ్ అనిపించుకున్న సినిమా. గూఢచారి హిట్. హలోగురూ ప్రేమకోసమే? మంచి సినిమా అనిపించుకుంది. వీళ్ళే కాకుండా యావరేజ్ సినిమా, ఓ ఫ్లాపు ఇచ్చిన మంచి డైరక్టర్లు చాలామంది వున్నారు. సుకుమార్, కొరటాల శివ, పరుశురామ్, బోయపాటి శ్రీనివాస్, మేర్లపాక గాంధీ, కళ్యాణ్ కృష్ణ, వక్కంతం వంశీ, చందుమొండేటి ఇలా చాలా పెద్ద లిస్టుంది. హిట్లు సూపర్ హిట్లు ఇచ్చినా ఇప్పటి వరకు తర్వాత సినిమా ఏంటో క్లారిటి లేదు. అంతేకాదు వీళ్ళెవరి సినిమాలు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఒకవేళ నిర్మాతలు లేరేమో అనుకుంటే పొరపాటే. వీళ్ళందరికి నిర్మాతలు రెడీగా వున్నారు. సమస్య అంతా హీరోలతోనేనట. అలా అని హీరోలు లేరా? అంటే అదీకాదు మన టాలీవుడ్ లో ఉన్నంత మంది హీరోలు ఇంకే భాషలోనూ లేరు.

వచ్చిన సమస్య అంతా ఏ హీరోతో చేయాలి? ఏ కథ తీస్తే చూస్తారు? ఎవరితో చేస్తే చూస్తారు? ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. అందుకే ఏ ప్రాజెక్టు కూడా అంత సులభంగా సెట్స్ పైకి రావడం లేదు. కానీ పూరి మాత్రం ఇలా హిట్ కొట్టి, అలా విజయ్ దేవరకొండ డేట్లు పట్టేశారు. మరో రెండు మూడు నెలల్లో సినిమాను సెట్ మీదకు తీసుకెళ్తాడు అంటే పూరి జగన్నాథ్ ఎంత టాలెంట్ ఉన్నవాడో అర్థమవుతుంది. డైరక్టర్ గా, నిర్మాతగా ఆయనకున్న టాలెంట్ మామూలుది కాదు. మరి వీళ్ళందరు పూరి ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే బావుంటుందేమో..! 


మరింత సమాచారం తెలుసుకోండి: