శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తొలి సినిమాతోనే తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించారు. ఇక అప్పటి నుండి ఇప్పటివరకు కేరీర్ పరంగా కొన్ని హిట్స్ మరికొన్ని ఫ్లాప్స్ చూసిన వరుణ్ తేజ్, ప్రస్తుతం మాస్ మరియు కమర్షియల్ సినిమాలు ఎంతో అద్భుతంగా తెరకెక్కించగల హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమా చేస్తున్నాడు. తమిళ్ లో బాబీ సింహ ప్రధాన పాత్రలో తెరకెక్కి, 

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్ సక్సెస్ సాధించిన జిగర్తాండ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించింది. తమిళ నటుడు అధర్వ మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా అందరిని ఆకట్టుకునేలా తీస్తున్నాడట దర్శకుడు హరీష్. ఇకపోతే యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలోని ఒక మాస్ సాంగ్ ని ఈనెల 21వ తేదీన యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. 

'జర్రా జర్రా' అనే పల్లవితో సాగె ఈ సాంగ్ వీడియోను 22వ తేదీన రిలీజ్ చేస్తారట. సినిమాలో మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చే ఈ సాంగ్, రేపు సినిమా రిలీజ్ అయిన తరువాత థియేటర్స్ లో అదరగొడుతుందని అంటోంది సినిమా యూనిట్. వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని, చోట కె ప్రసాద్ ఎడిటింగ్ ని అందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సెప్టెంబర్ 13న రిలీజ్ చేయనున్నారు....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: