ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమా పై భారీ లంచాలు ఉన్న సంగతి తెలిసిందే. అంచనాల నేపథ్యంలో సినిమాను సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అయితే, సినిమా షూటింగ్ మాత్రం చాలా స్లోగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కారణాలు చాలా ఉన్నాయి. మొదట సినిమా కోసం చూసిన విదేశీ హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడంతో సినిమా ఆలస్యం అయ్యింది. అదే సమయంలో రామ్ చరణ్ కు గాయం కావడంతో మరోసారి ఆలస్యం అయ్యింది.
కొంతకాలం సినిమాను పక్కన పెట్టి మరలా షూటింగ్ స్టార్ట్ చేయబోయే సమయానికి ఎన్టీఆర్ కు గాయం కావడంతో మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యింది. కాగా ఇప్పుడు షూటింగ్ ను వేగంగా చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యం అవుతున్నా.. రిలీజ్ డేట్ ను మాత్రం మార్చడం లేదు రాజమౌళి. సినిమాను అనుకున్నట్టుగా సమయానికి రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అయితే, వచ్చే ఏడాది జులై 30 వ తేదీన ఆర్ఆర్ ఆర్ సినిమాకు పోటీగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అందులో ఒకటి భూల్ భూలయ్యా 2. గతంలో రజినీకాంత్ హీరోగా చేసిన చంద్రముఖి సినిమాకు రీమేక్ గా హిందీలో ఈ సినిమా రీమేక్ అయ్యింది. దానికి కొనసాగింపుగా పార్ట్ 2 వస్తున్నది. కార్తీక్ ఆర్యన్ హీరో. ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆర్ఆర్ ఆర్ సినిమా వస్తున్నప్పటికీ బాలీవుడ్ సినిమాలు డేట్ ను మార్చుకోవడం లేదు.
ఈ మూవీతో పాటు అక్షయ్ కుమార్.. రోహిత్ శెట్టి కాంబినేషన్లో వస్తున్న సినిమాను కూడా అదే డేట్ కు రాబోతున్నది. అలానే సల్మాన్ ఖాన్ ఇన్షాల్లా సినిమా కూడా ఇంచుమించుగా అదే సమయంలో రిలీజ్ అవుతుంది. ఇలా నార్త్ లో పెద్ద సినిమాలు ఆర్ఆర్ఆర్ కు పోటీగా రాబోతున్నాయి. అయితే, ఇందులో ఎన్ని సినిమాలు ఆ డేట్ కు రిలీజ్ అవుతాయి అన్నది త్వరలోనే తెలుస్తుంది.