మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై ఎన్టీఆర్ తర్వాత నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న నటుడు.. అంతే కాదు.. ఆ స్థానాన్ని దశాబ్దాల పాటు నిలుపుకున్న నటుడు. అంతేనా.. ఆ తర్వాత ఆ స్థాయిలో వేరే ఏ నటుడు చిరంజీవి స్థానాన్ని భర్తీ చేయలేదు. అసలు నెంబర్ వన్ అనే పొజిషన్ చిరంజీవితోనే ముగిసినట్టు అనిపిస్తోంది.


అలాంటి మెగాస్టార్ ఇప్పుడు మరోసారి విజృంభిస్తున్నాడు. ‘ఖైదీ నంబర్‌ 150’తో తన సత్తా ఏంటో చాటిన చిరు.. ఇప్పుడు సైరా అంటూ మరోసారి బరిలో దూకుతున్నాడు. తన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈ నేపథ్యంలో ‘బి పాజిటివ్‌’ మ్యాగజైన్‌ కోసం చిరంజీవి కోడలు ఉపాసన చిరంజీవిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.


ఇంతకీ మీకు మీకు బాగా నచ్చిన సినిమా ఏదని అడిగితె చిరంజీవి ఇలా చెప్పారు..

" నాకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో 1983లో వచ్చిన ‘ఖైదీ’ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే, ఆ చిత్రం నాకు స్టార్‌ స్టేటస్‌ ఇచ్చింది. అప్పటివరకూ నేను చేసింది కేవలం 15 చిత్రాలే. కానీ ‘ఖైదీ’ చిత్రంతో నాకు భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చింది. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాదు, నాలో ఉన్న టాలెంట్‌లన్నీ ప్రదర్శించడానికి ఆ చిత్రం ఓ వేదిక అయింది.


ముఖ్యంగా డ్యాన్స్‌లు, ఫైట్స్‌లతో పాటు, సీరియస్‌గా నటించడానికి ఆస్కారం కల్పించింది. ఆ చిత్రంతో నన్ను నేను నిరూపించుకున్నా. ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. ఎవరైనా ‘మీ ఫేవరెట్‌ చిత్రం ఏది’ అంటే కచ్చితంగా ‘ఖైదీ’ అనే చెబుతా.. అన్నారు చిరంజీవి. ఇక ‘ఖైదీ నంబర్‌ 150’ పేరుతో నా 150వ సినిమా చేయడం యాదృచ్చికంగా జరిగిందన్నారు మెగాస్టార్.. అది నాన్‌ ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టినందుకు చాలా గర్వంగా అనిపించిందట.


మరింత సమాచారం తెలుసుకోండి: