యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో థియేట్రికల్ ట్రైలర్ మరియు వీడియో సాంగ్స్ ప్రోమోలు ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, పెద్ద సంచలనాన్ని సృష్టించగా, తాజాగా సాహోలో ఆయన నటించిన బ్యాడ్ బాయ్ అనే సాంగ్ వీడియో కూడా పలు భాషల్లో అదరగొడుతూ, అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోతోంది. నిజానికి ఈ సాంగ్ ని ఇప్పటివరకు బయటకు రిలీజ్ చేయని సాహో టీమ్, మొన్నటి ప్రి రిలీజ్ వేడుక సమయంలో అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడం జరిగింది. ఈ సాంగ్ లో ట్రెండీ స్టైల్ అవుట్ ఫిట్స్ లో యూత్ ని ఆకట్టుకున్న రెబల్ స్టార్ ప్రభాస్, 

బాలీవుడ్ బ్యూటీ జాక్వలీన్ ఫెర్నాండేజ్ తో కలిసి చిందేయడం జరిగింది. అద్భుతమైన ఫారెన్ లొకేషన్స్ లో ఫిమేల్ డాన్సర్స్ మధ్య ఎంతో స్టైలిష్ గా చిత్రీకరించిన ఈ సాంగ్ కు యూత్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఈ సాంగ్ లో ప్రభాస్ మరియు జాక్వలీన్ ల జోడి అదిరిందని, అలానే మధ్యలో వారిద్దరూ కలిసి వేసే కూల్ స్టెప్స్ అయితే మరింత అదిరిపోయాయని, ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా పలువురు ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు. ఇక ఇప్పటికే ఒక బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ సినిమాలో, 

మరొక బాలీవుడ్ హీరోయిన్ జాక్వలీన్ కూడా ఒక స్పెషల్ సాంగ్ లో మెరవనుండడం, బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత తారా స్థాయికి తీసుకెళ్లింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ చేసిన సాహో గేమ్ టీజర్ కూడా మంచి ఆదరణను చూరగొన్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఎవరిని కదిలించినా సాహో నామాన్నే జపిస్తున్నారు. మరి ఇంతిదిగా ప్రేక్షకుల్లో అంచనాలు నింపిన ఈ సాహో సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని సినిమా ప్రేక్షకులతో పాటు సినీ మరియు ట్రేడ్ విశ్లేషకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: