చంద్రబాబు రాజకీయ దురంధరుడు, తిమ్మిని బమ్మిని చేయగల సమర్ధుడు. బాబు మార్కు పాలిటిక్స్ వేరేగా ఉంటాయి. ఆయన కిందాపడ్డా పైచేయి సాధించాలనుకుంటాడు. అటువంటి బాబుకు గత ఏడాదిగా చెడ్డ రోజులు ప్రాప్తించాయి. బాబుకు ఎదురు నిలిచి మరీ బంపర్ మెజారిటీతో గెలిచిన జగన్ ఇపుడు అధికాలోకి వచ్చి పెను సవాల్ విసురుతున్నారు. బాబును ముప్పతిప్పలు పెడుతున్నారు.

 

గత ఏడాదిగా టీడీపీ దెబ్బ తిన్న తీరు ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేదు, అన్ని వ్యాపారాలు టీడీపీ మద్దతుదారులవి బంద్ అయ్యాయి. టీడీపీ ఎన్నడూ చూడనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఒక్కో నేతా ఇపుడు వరసగా  జైలు పాలు అవుతున్నారు. 

 

ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన అచ్చెన్నాయుడు అరెస్ట్ తో మొదలైన అరెస్టుల పర్వం ఆ తరువాత జేసీ ప్రభాకరరెడ్డి, కొల్లు రవీంద్ర వరకూ సాగింది. ఇపుడు విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టార్గెట్ అంటున్నారు. ఆయన విద్యామంత్రిగా ఉన్నపుడు చోటు చేసుకున్న సైకిల్ కుంభకోణం మీద వైసీపీ ఎంపీ విజసాయిరెడ్డి అదే పనిగా చేస్తున్న ఆరోపణాలతో గంటాకు చిక్కులు తప్పవా అన్న డౌట్లు వస్తున్నాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే మొదట్లో బీసీల మీద అరెస్టులు  అంటూ గగ్గోలు పెట్టిన బాబు ఆ తరువాత వైసీపీ సర్కార్ ది  అక్రమం, అన్యాయం అంటూ కొత్త రాగాలు తీశారు. తీరా ఇపుడు అన్నీ అయిపోయాయేమో ఎంపీ తమ్ముళ్ళు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతికి కలసి ఏపీలో రాజ్యాంగపరమైన రక్షణ లేదని, విపక్షం మీద దాడులు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.

 

అంటే కధ ఓవర్ టూ ఢిల్లీగా మార్చాలని బాబు తాపత్రయం కానీ ఏపీలో అరెస్టులకు ఆధారాలు చూపిస్తూనే కదా కధను కంచికి చేర్చింది. ఈ మాత్రం లాజిక్ తెలియకుండానే ఫిర్యాదు చేస్తే వర్కౌట్ అవుతుందా. మొత్తానికి ఇపుడు బాబు తన చేతుల్లో ఏదీ లేదని తేల్చేశారా అన్న డౌట్లు వస్తున్నాయిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: