అవినీతి  అంతం నా పంతం

సమాజంలో ఉన్నా అన్ని రుగ్మతలకి  అవినీతి తల్లివేరు వంటిదని దానిని అంతం  చేయడం ద్వారా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు  అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు.   ఆయన అమెరికా పర్యటనలో భాగంగా ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ హై విధంగా వ్యాఖ్యానించారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతి ని కడ వరకూ నిర్మూలించే వరకు విశ్రమించని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా చెప్పారు.

 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో అవినీతి  అనేది పూర్తిగా తుడిచిపెట్టుకు పోవాలని తమ ప్రభుత్వ ధ్యేయమని దాన్ని సాధించడానికి  అహరహం కష్టపడి పనిచేస్తామని. అవినీతి నిర్మూలన విషయంలో రాజీపడే సమస్య లేదని ఆయన చెప్పారు.   తమ ప్రభుత్వం వచ్చిన ఈ రెండు నెలల కాలంలోనే చరిత్రలో కొత్త ఒరవడి సృష్టించా మనీ, తలచుకుంటే సాధించలేనిది లేదని అందువల్ల తప్పనిసరిగా ఈ అవినీతి అన్యాయం అక్రమము అనే వాటిని పూర్తిగా నిర్మూలిస్తామని  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

 అన్నదాతల ఆత్మహత్యలు గాని, ఉపాధి లేదని యువత  నైరాశ్యం గాని సహించలేని ప్రభుత్వం తమదని అందువల్లనే స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ చట్టం చేశామని  చెప్పారు. మా ప్రభుత్వం మహిళలకు కూడా సముచిత స్థానం కనిపిస్తుందని నామినేటెడ్ పదవులు వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించా మనీ  చెప్పారు.

 రాష్ట్రాభివృద్ధికి ప్రవాసాంధ్రులు చేయూత అందించాలని,  ప్రవాసాంధ్రులు అంతా తనతో కలిసి వస్తే రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుంది  అని, మీ అందరి సహకారంతో రాష్ట్రంలోని ప్రతి ఉరూ అభివృద్ధి పంచుకుందామని ఆయన ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: