తాను ఫార్టీ యియర్స్ రాజకీయ  అనుభవం కలిగినవాడినని చంద్రబాబు ఎపుడూ వూదరకొడుతూ ఉంటారు. నేను తలచుకుంటే ఏదైనా చేయగలనని కూడా ఆయన అంటూంటారు. తన కంటే సీనియర్ మోస్ట్ లీడర్ దేశంలో లేరని కూడా చంద్రబాబు తనకు తానుగా  ప్రకటించుకుంటారు. తనను విభజన ఏపీకి ఏరీ కోరీ జనం ఎన్నుకున్నారని అప్పట్లో బాబు ప్రతీ రోజూ చెప్పేవారు. ఇపుడు సీన్ రివర్స్ అయింది. బాబు పోయి జగన్ వచ్చారు.


మరి జగన్ బాబుని మించాలంటే అయన చేసిన తప్పులు చేయకూడదు, ఆయనలా ఆర్భాటపు ప్రకటనలు అంతకంటే చేయకూడాదు. ఇక చంద్రబాబు చేయలేనివి చాలానే ఉన్నాయి. వాటిని కనుక జగన్ సాధిస్తే ఏపీలో జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. అదే టైంలో బాబుని మించిన నేతగా ముందుకు వస్తారు. ఏపీ విషయానికి వస్తే పెట్టుబడులు అవసరం చాలా ఉంది. కొత్త రాష్ట్రం, ఒక్క పరిశ్రమ కూడా లేదు.


ఈ సమయంలో చంద్రబాబు అయిదేళ్ళలో ఎన్నో విన్యాసాలు చేశారు. అదిగో లక్షల కోట్ల పెట్టుబడులు, ఇదిగో వచ్చేస్తున్నాయి అని కూడా అన్నారు. మరి బాబు అందమైన ముఖం చూసి పెట్టుబడులు ఏపీకి వస్తాయా అని అప్పట్లొ జగన్ ఎద్దేవా చేసేవారు. ప్రత్యేక హోదా తెస్తే అవే పరుగులు పెట్టుకుంటూ వస్తాయని కూడా జగన్ అనేవారు. ఇపుడు చూస్తే ఏపీకి ప్రత్యెకా హోదా అసలు రాలేదు. మరి పెట్టుబడుల సంగతేంటి.


జగన్ అందమైన ముఖం చూసి పెట్టుబడులు వస్తాయా అని అమెరికా టూర్ పై తమ్ముళ్ళు అపుడే సెటైర్లు వేస్తున్నారు. డల్లాస్ లో మాట్లాడినా, అంతకు ముందు ప్రవాస పారిశ్రామికవేత్తలతో కలిసినా జగన్ పెట్టుబడులు పెట్టండని గట్టిగా కోరుతున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. బాగానే ఉంది. రాయితీలు ఎన్ని ఇచ్చినా కూడా ఏపీకి పారిశ్రామికవేత్తలు వస్తారా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్న. ఏపీలో జగన్ పెట్టుబడులు ఎలా తేగలరు అన్నది కూడా పెద్ద చర్చగానే ఉంది. 


మరి మాట ఇస్తే వెనక్కి తగ్గని నైజం, పరిపాలనా పరంగా తీసుకువస్తున్న సంస్కరణలు, సర్కార్ అన్ని విధాలుగా భరోసాగా ఉంటుందన్న నమ్మకం, ఇవనీ కలిస్తే, జగన్ మాటను నమ్మితే పెట్టుబడులు వస్తాయి. మరి జగన్ ఆ దిశగా ఎంతవరకూ మెప్పించలగలరో చూడాలి. అదే కనుక చేస్తే బాబుకు, టీడీపీకి  ఏక కాలంలో  షాక్ ఇచ్చిన వారు అవుతారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ అమెరికా టూర్లో బాగానే మాట్లాడారని అందరూ అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: