"నీ వున్నాను." అనే జగన్, తూర్పు గోదావరి రాష్ట్రంలో భారీగా వరదలు వస్తున్నాయని తెలిసి కూడా అదేమీ పట్టనట్టుగా, ముందస్తు చర్యలు చేపట్టకుండా సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఎప్పుడూ తానున్నాను.. తాను విన్నాననే జగన్మోహన్‌రెడ్డి.. తాను చూడనంటూ అమెరికాకు పారిపోయారని ఎద్దేవా చేశారు.


చంద్రబాబు హయాంలో వరదలు వస్తే ఎప్పుడు ఏ బ్యారేజీకి ఎంత నీరు వస్తుందో ముందుగానే గ్రహించి చర్యలు తీసుకునేవారన్నారు. జులై 25 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వస్తాయని... కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు హెచ్చరించినప్పటికీ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. అధికారులు రివర్స్ టెండరింగ్ చుట్టూ... మంత్రులు చంద్రబాబు నివాసం చుట్టూ తిరుగుతున్నారని చినరాజప్ప విమర్శించారు.


ఫలితంగా ఇళ్లు మునిగిపోయి, ప్రజలు నిరాశ్రయులయ్యారన్నారు. రైతులు లక్షల ఎకరాల్లో పంటను నష్టపోయారన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులలో పూర్తిగా నీరు నిండకుండానే ఎందుకు కిందకు వదిలారని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర నీటి నిల్వ ఎక్కువయ్యే కొద్దీ నీటి మట్టం పెరిగి చంద్రబాబు ఇంట్లోకి నీరు ప్రవేశిస్తుందన్నారు. అమరావతి మునిగిందని, రాజధానిపై విష ప్రచారం చేసే కుట్రకు తెరదీశారన్నారు.


చంద్రబాబు ఇంట్లో లేనప్పుడు ఆయనను కాపాడేందుకే అని ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. వారి చర్యలన్నియూ ఒక ప్రక్క, ఈ తెలుగు ప్రజలు చూస్తున్నారని, ఇంకా వాళ్ళ నాటకాలు ఎన్నాళ్ళో సాగవని, ఏది ఏమైనా వారి ఆటలు మూన్నాళ్ళ ముచ్చటే అని, రానున్న ఎలక్షన్లలో మాదే పై చేయి అని చాల కరాఖండిగా చెప్పారు. తెలుగు దేశానికి అపూర్వ వైభవం రాబోతోందని, ఇంకా ఎన్ని రోజులో లేదని, రాబోతున్నది మంచి తరుణమని, చిలక జోస్యం చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: