అధికారంలో ఉండగా చేసిన తప్పులు ఇపుడు వెంటాడుతున్నాయి కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని. అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తుళ్ళూరు పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత లాగ కోడెలతో పాటు ఆయన కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మిలు చేసిన అరాచకాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం వచ్చినట్లే ఉంది.

 

స్పీకర్ పదవిని అడ్డుపెట్టుకుని కోడెల విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్తులను సొంతానికి వాడుకోవటమన్నది అందులో ప్రధానమైనది. ఎవరైనా పదవిలో ఉన్నపుడు వాడుకోవటం సహజమే. కానీ అధికారిక నివాసంలో వాడుకోవటం వేరు సొంత ఇంటికి పంపేయటం వేరు. సొంత ఇంటినే అధికారిక నివాసంగా వాడుకుంటే ఏదోలే అనుకోవచ్చు.

 

కానీ కోడెల ఆ పనిచేయలేదు. ప్రభుత్వ భవనాన్ని వాడుకుంటునే ప్రభుత్వ ఆస్తులను తన సొంత ఇంటికి చేరవేశారు. ఏపి ప్రభుత్వం హైదరాబాద్ నుండి విజయవాడకు తరలి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో హైదరాబాద్ లో కోడెల ఇంటికి ప్రభుత్వానికి చెందిన ఏసి తదితర విలువైన వాటిని బిగించుకున్నారు. అయితే విజయవాడకు తరలి వెళ్ళిపోయినపుడు వాటిని హైదరాబాద్ లోనే సొంతానికి ఉంచేసుకున్నారు.

 

మళ్ళీ విజయవాడలో అధికారిక భవనానికి కొత్తగా తెప్పించుకోవటమే కాకుండా తన సొంతూర్లోని ఇంట్లో  కూడా ప్రభుత్వ ఆస్తులనే ఉపయోగించుకున్నారు. దీనిపై ప్రభుత్వం మారిన తర్వాత నోటీసు ఇచ్చినా సమాధానం లేదు. సరే కోడెల అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడుకు, కూతురు చేసిన అరాచకాలు మళ్ళీ వేరే.

 

సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొత్తం ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ? ఎవరెవరు వాడుతున్నారు ? అనే విషయాలపై విచారణ జరిగింది. చీఫ్ సెక్రటరీ ఈ విషయమై విచారణ జరిపారు. దాంతో ప్రముఖంగా కోడెల వ్యవహారం వెలుగు చూసింది. దాంతో కోడెలపై తుళ్ళూరు పోలీసుస్టేషన్లో ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అసెంబ్లీకి వచ్చి విచారణ జరిపిన పోలీసులు కోడెలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎలాగూ ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఇక అరెస్టు ఒకటే మిగిలింది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: