ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య సహృద్భావ వాతావరణం ఉండేది.  పాకిస్తాన్ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ విషయంలో పదేపదే కలగజేసుకోవడం మొదలు పెట్టిందో అప్పటి నుంచి రెండు దేశాల మధ్య గొడవలు మొదలయ్యాయి.  కాల్పుల విరమణను పక్కన పెట్టి పాక్ పదేపదే ఇండియా సైనికులపై కాల్పులు జరుపుతుండటంతో ఇండియా దానికి ధీటుగా జవాబిస్తోంది.  గత ప్రభుత్వాలు సైనికుల రక్షణ గురించి పెద్దగా పట్టించుకోలేదు.  ఆర్టికల్ 370 అమలులో ఉండటంతో .. దేశం బోర్డర్ లో కాపలా కాసే సైనికులను కొంతమంది ప్రేరేపిత కాశ్మీరీ యువత సైనికులపై దాడులు చేసేది. 


కానీ వాళ్ళను ఏమి చేయలేని స్థితి. కారణం ఆర్టికల్ 370.  అందుకే మోడీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ఆర్టికల్ 370 ని రద్దు చేసింది.  ఇప్పుడు కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం.  ప్రతి పౌరుడు చట్టాలను విధిగా గౌరవించాలి.  లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియాలోకి ఉగ్రవాదులు ప్రవేశించలేకపోతున్నారు.  పదేపదే ఎల్ ఓ సిలో కాల్పులు జరిపి.. ఆ ప్రాంతంగుండా ఇండియాలోకి ప్రవేశించాలని ఉగ్రవాదులు చూస్తున్న కుదరడం లేదు. 


ఇదిలా ఉంటె, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ గడబిడ చేస్తున్నది.  కాశ్మీర్ ప్రజలకు అండగా ఉంటామని చెప్తోంది.  కాశ్మీర్ కోసం పోరాటం చేస్తామని చెప్తోంది పాకిస్తాన్.  ఇండియాలో అంతర్భాగమైన కాశ్మీర్ పై అంతటి శ్రద్ద ఏంటో అర్ధం కావడం లేదు.  పైగా ఇప్పుడు కాశ్మీర్ ప్రజలకు మద్దతుగా నిలుస్తానని చెప్పిన పాక్ ఆర్మీ చీఫ్ జావేద్ బజ్వా పదవిని మరో మూడేళ్లు పెంచుతూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిర్ణయం తీసుకున్నారు.  అంటే ఇండియాకు వ్యతిరేకంగా, కాశ్మీర్ కు అనుకూలంగా మాట్లాడే వాళ్లకు అక్కడి ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోంది.  


పక్క దేశాల గురించి కాకుండా.. ముందు దేశంలోని అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించుకుంటే అభివృద్ధి చెందుతుంది.  పెరుగుట విరుగుట కొరకే అని చెప్పినట్టు.. మనం పెంచి పోషించే పాము మనల్నే కాటేస్తుంది.. అది దృష్టిలో పెట్టుకోవాలి.  పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఇతరకుపై ప్రయోగిస్తున్నది.  ఒకవేళ తేడావచ్చి.. అదే ఉగ్రవాదం పెంచి పోషించిన వారిపై తిరగబడితే.. పరిస్థితి ఏంటి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: