400 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న సంస్థలకు కార్పొరేట్ పన్ను రేటు క్రమంగా 25 శాతానికి తగ్గిస్తుందని, సంపద సృష్టికర్తలకు ప్రభుత్వం తమ వంతు మద్దతు ఇస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం ఒక ప్రెస్ మీట్ లో అన్నారు. గత నెల తన తొలి యూనియన్ బడ్జెట్‌లో, వార్షిక టర్నోవర్ 400 కోట్ల రూపాయల పైగా ఉన్న కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుండి 25 శాతానికి  తగ్గించింది. 


గతేడాది అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 250 కోట్ల  టర్నోవర్ ఉన్న సంస్థలకు కార్పొరేట్ ఆదాయపు పన్ను రేటును 25 శాతానికి తగ్గించారు. ఇక్కడ జరిగిన ఒక పరిశ్రమ కార్యక్రమంలో శ్రీమతి సీతారామన్ మాట్లాడుతూ మిగతా కార్పొరేట్‌లకు కార్పొరేట్ పన్ను తగ్గింపు క్రమంగా ఉంటుంది అని తెలిపారు కానీ ఆ తగ్గింపు‌ ఎప్పుడు అన్నదానిపై ఆమె సమాచారం ఇవ్వలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాన్ని ప్రతిధ్వనిస్తూ, భారత సంపద సృష్టికర్త పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల మద్దతు ఇస్తామని తెలిపిన విషయాన్ని  ఆమె ఈ సమయంలో‌ గుర్తు చేశారు. 

 ఆగస్టు 15 న మోడీ తన వార్షిక స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సంపద సృష్టికర్తల పాత్రను ప్రశంసించారు మరియు వారిని అనుమానంతో చూడకూడదని అన్నారు. "సంపద సృష్టికర్తలను మనం ఎప్పుడూ అనుమానంతో చూడము. సంపద సృష్టించినప్పుడే సంపద పంపిణీ చేయబడుతుంది, సంపద సృష్టి ఖచ్చితంగా అవసరం. సంపదను సృష్టించే వారు భారతదేశం యొక్క సంపద మరియు మేము వారిని గౌరవిస్తాము. ”అని అన్నారు.

ఇలా చేయడం వలన భారత దేశానికి మరి కొన్ని కార్పొరేట్ సంస్థలు వస్థాయని వాటి ద్వారా మరికొంత మందికి ఉద్యోగాలు వస్థాయని అందుకని తాము ఈ‌ నిర్ణయం‌ తీసుకుంటున్నట్టు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: