చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.  40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు పట్టుమని పదేళ్లు కూడా అనుభవం లేని జగన్ చూసి బెదిరిపోతున్నారు.  దీనికి కారణాలు ఏంటి.. ఎందుకు బాబు భయపడుతున్నారు.  ఈ భయం వెనుక ఏవైనా రాజకీయ కారణాలు ఉన్నాయా..? డ్రోన్ వీడియోల గురించి ఎందుకు కంగారు పడుతున్నారు..!! వరదల కారణంగా నీరు కరకట్ట మీదకు వస్తే.. వాటిని కృత్రిమ వరదలు అని ఎందుకు చెప్పినట్టు.. 


చంద్రబాబు నాయుడుకు చెందిన అనేక మంది నేతలు అమరావతి పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టారు.  భూములు కొన్నారు.  బాబు రెండోసారి అధికారంలోకి వస్తారని.. అక్కడ భూములకు భూమ్ వస్తుందని అనుకున్నారు.  కానీ, అనుకున్నది ఒకటి అక్కడ జరిగింది మరొకటిగా మారింది.  బాబు అధికారాన్ని కోల్పోయారు.  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.  


అమరావతి నిర్మాణాన్ని పక్కన పెట్టారు.  దీంతో అక్కడి భూముల రెక్కలు ఒక్కసారిగా తెగిపోయాయి.  పదేళ్ల తరువాత మరలా రాష్ట్రంలోని జలాశయాలు నిండాయి.  విజయవాడ బ్యారేజ్ కు భారీ వరద నీరు రావడంతో వాటిని ఒక్కసారిగా కిందకు వదిలారు.  దీంతో కరకట్ట మీదున్న అనేక ఇల్లు నీట మునిగాయి.  ఇలా మునిగిపోవడంతో డ్రోన్ కెమెరాలతో వరద ఉదృతిని పరీక్షించారు.   అయితే డ్రోన్ లతో బాబు ఇంటిని పరిశీలించడం రాజకీయంగా రగడకు దారితీసింది.  బాబు భద్రతకు ముప్పు వాటిల్లబోతుందని టిడిపి నేతలు ఆరోపణలు చేశారు.  


ఈ ఆరోపణలో ఎంతవరకు నిజం ఉన్నది అనే విషయం పక్కన పెడితే.. రాజకీయంగా మాత్రం ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది.  ఇవి కేవలం కృత్రిమ వరదలని, కావాలని వీటిని సృష్టించారని బాబు ఆరోపణ.  పైనుంచి ఎక్కవగా వరద నీరు వస్తుంది అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా వరద నీటిని క్రమంగా కిందకు వదలాలి.  అలా కాకుండా ఇలా ఒక్కసారే వదలడం వెనుక ఉద్దేశ్యం ఏంటో చెప్పాలని బాబు డిమాండ్ చేస్తున్నారు.  మరి బాబు డిమాండ్స్ కు వైకాపా ప్రభుత్వం సమాధానం చెప్తుందా లేక సైలెంట్ గా ఉంటుందా.  నెక్స్ట్ వైకాపా బాబు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అని భయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: