నరేంద్ర మోడీ ప్రపంచంలో పవర్ఫుల్ నేతగా ఎదుగుతున్నారు. ప్రపంచంలో టాప్ 5నేతల్లో మోడీ ఒకరని ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు.  ఎన్నో అంతర్జాతీయ వేదికలపై మోడీ ప్రసంగాలు చేస్తున్నారు.  అయన చేసే ప్రతి ప్రసంగం అందరిని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.  మోడీ ప్రసంగాలు ప్రభావశీలంగా ఉంటాయి.  ఆకట్టుకునే విధంగా ఉంటాయి.  ఎందుకంటే, అంర్జాతీయంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది.  దానిని ఉపయోగించుకున్న వ్యక్తులే గొప్పవారీగా ఎదుగుతునారు.  


మోడీ అధికారం చేపట్టిన ఈ ఆరేళ్లలోనే ఎన్నో అవార్డులు అందుకున్నారు.  నిన్న యూఏఈ టాప్ అవార్డును సొంతం చేసుకున్నారు.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఒక ముస్లిం దేశం ఇలా మోడీని టాప్ అవార్డుతో సత్కరించింది అంటే అర్ధం చేసుకోవచ్చు.  అభివృద్ధికి మోడీ ఎంతగా కట్టుబడి ఉన్నాడో అర్ధం అవుతుంది.  ఒక్క యూఏఈ మాత్రమే కాదు ఎన్నో దేశాలు మోడీని ఆహ్వానిస్తున్నాయి.  ప్రసంగాలు చేయమని కోరుతున్నారు.  ప్రపంచంలోని చిన్న చిన్న దేశాలు ఇండియాకు చాలా దగ్గరయ్యాయి.  


అటు ఐక్యరాజ్యసమితిలో కూడా ఇండియాకు తిరుగులేకుండా ఉన్నాడు. మోడీ దూకుడు, హవా చూస్తుంటే.. మరో రెండు మూడేళ్ళలో ఇండియా భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా మారే అవకాశం కనిపిస్తోంది.  ఇది మోడీ వలనే సాధ్యం అవుతుంది అనడంలో సందేహం అవసరం లేదు.  అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా పరిస్కారం కాకుండా ఉన్న సమస్యలను మోడీ వరుసగా పరిష్కరించుకుంటూ వస్తున్నాడు.  


ఇండియాకు ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించే బాంగ్లాదేశ్ కూడా ఇండియాకు స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలిచింది.  అటు అరబ్ దేశాలు కూడా ఇండియాకు సపోర్ట్ చేస్తున్నాయి.  పాకిస్తాన్ కు మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న టర్కీ దేశం కూడా తన ఉద్దేశ్యాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటి వరకు ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ వచ్చిన టర్కీ వెనక్కి తగ్గింది.  చైనా కూడా ఈ విషయంలో ఆలోచనలో పడిపోయింది.  పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తే.. దాని వలన ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్నాయి ఆయా దేశాలు.  పాకిస్తాన్ అంతర్జాతీయంగా అనేక ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కొంటుంది.  ఇలానే కొన్నాళ్ళు ఎదుర్కొంటే.. ఉత్తర కొరియాల మారిపోవాల్సి వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: