‘బిగ్ బాస్ 2’ సీజన్ మొదటివారం ఎలిమినేషన్ లో ఎవరి ఊహలకు అందని విధంగా ఎలిమినేట్ అయిన సంజన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నో ఆశలతో ‘బిగ్ బాస్ 2’ హౌస్ లోకి అడుగుపెట్టిన సంజన అందరికంటే ముందుగా హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉంది.  
బిగ్ బాస్ విన్నర్ అయి ఉంటే
‘బిగ్ బాస్ 2 హోస్ట్’ గా నాని తీరు తనకు నచ్చలేదని సంజన తెలిపింది. తాను ఎన్టీఆర్ అభిమానిని కాబట్టి అలా అనిపించిందేమో అని చెప్పలేను కానీ అంచనాలకు అనుగుణంగా నాని ఈకార్యక్రమాన్ని హోస్ట్ చేయలేకపోతున్నాడు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది సంజన. భవిష్యత్ లో తాను ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనను అంటూ ‘బిగ్ బాస్’ కార్యక్రమ నిర్వాహకులు చేస్తున్న ఒక సీక్రెట్ ను బయటపెట్టింది.
బిగ్ బాస్ జోలికే వెళ్లను
తనతో పాటు సామాన్యులుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన నూతన నాయుడు, గణేష్ కు బిగ్ బాస్ నిర్వాహకులు రెమ్యునరేషన్ ఇవ్వలేదన్న విషయాన్ని తెలియచేసింది. అంతేకాదు బిగ్ బాస్ తమకు తమ క్రేజ్ పెంచుకోవడానికి ఒక ఫ్లాట్ ఫామ్ మాత్రమే అన్న విషయాన్ని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు తెలియచేసిన విషయాన్ని ప్రస్తావించింది. 
రెమ్యునరేషన్ లేదు
అంతేకాదు తాను బిగ్ బాస్ విన్నర్ అయి ఉంటే ఒక వృద్ధాశ్రమం నిర్మించి ఉండే దానిని అన్న విషయం చెపుతూ తన కలలు నెరవేరనందుకు నిరాశగా ఉంది అని కామెంట్స్ చేసింది సంజన. చివరికి సంజన ఎలిమినేషన్ తో ‘బిగ్ బాస్ 2’ గుట్టు బయటపడింది. మొదటివారం ఎలిమినేషన్ తరువాత నిన్న ప్రసారం అయిన ‘బిగ్ బాస్ 2’ షో కూడ పేలవంగా కనిపించడంతో మొత్తం ఈ కార్యక్రమం సీజన్ అంతా ఇలాగే డల్ గా జరిగే ఆస్కారం కనిపిస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: